‘పెట్రో’ వడ్డన.. మరోసారి పెరిగిన ధరలు
ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెంచుతుండడంతో వాహనదారులపై భారం పడుతున్నది. పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటర్కు రూ. 2.84, డీజిల్ లీటర్కు రూ.2.86 పెరగగా.. పెరిగిన ధరలు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి.
- లీటర్ పెట్రోల్ రూ.117.09, డీజిల్ రూ.105.29
- వాహనదారులపై భారం
ఆదిలాబాద్, మే 25(నమస్తే తెలంగాణ) : ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు క్రమంగా పెంచుతుండడంతో వాహనదారులపై భారం పడుతున్నది. పది రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్ ధరలు పెరగడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. పెట్రోల్ లీటర్కు రూ. 2.84, డీజిల్ లీటర్కు రూ.2.86 పెరగగా.. పెరిగిన ధరలు సోమవారం ఉదయం నుంచి అమల్లోకి వచ్చాయి. పెరిగిన ధరలతో ఆదిలాబాద్ జిల్లాలో పెట్రోల్ లీటర్కు రూ.117.09.. డీజిల్ రూ.105.29కు చేరుకున్నది. ఆదిలాబాద్ జిల్లాలో రోజు 75 వేల లీటర్ల పెట్రోల్, రెండు లక్షల లీటర్ల డీజిల్ వినియోగం అవుతున్నది. పెరిగిన ధరలతో పేద, మధ్య తరగతి వారిపై భారం పడుతుండగా.. ఆర్థికంగా నష్టపోతున్నారు. పెట్రోల్ ధరలు క్రమంగా పెరుగుతుండడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినా ప్రజలపై భారం మోపుతున్నారు
పెట్రోల్, డీజిల్ ధరలు పది రోజుల్లో నాలుగు సార్లు పెరగడంతో వాహనాదారులు నష్టపోవాల్సి వస్తున్నది. క్రూడ్ అయిల్ ధరలు తగ్గినా ఆయిల్ కంపెనీలు ఇష్టానుసారంగా ధరలు పెంచుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం తో పేద, మధ్య తరగతి ప్రజలపై భారం పడుతున్నది. పెట్రో ధరలు పెరిగి న కారణంగా నిత్యావసరాలు, ఇతర ధరలు పెరుగుతున్నాయి. పది రోజుల్లో పెట్రోల్పై రూ.7.38, డీజిల్పై రూ.7.49 పెరిగాయి. ధరల పెరు గుదలకు అమెరికా, ఇరాన్ యుద్ధం కారణంగా చూపుతున్న కేంద్ర ప్రభు త్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి.
– విజ్జిగిరి నారాయణ, ఆదిలాబాద్
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

