ఖానాపూర్, మే 6: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. కొనుగోలు కేం ద్రాల్లో మక్కలు విక్రయించి మద్దతు ధర పొందాలని సూచించారు. మక్క క్వింటాలుకురూ. 1962 తో ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని అన్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, ఏఎంసీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, వైస్ ఎంపీ పీ వాల్సింగ్, కౌన్సిలర్ సంతోష్, మాజీ జడ్పీటీసీ రామునాయక్, నాయకులు ప్రదీప్, గోపాల్, శ్రీనివాస్, నర్సయ్య, మహేశ్ రైతులు పాల్గొన్నారు.
కడెం, మే 6: మండలంలోని లింగాపూర్, నర్సింగపూర్, కొండుకూర్‌లో ఏర్పాటు వరి, మక్క కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు గోళ్ల వేణుగోపాల్, ఆకుల బాలవ్వ, మార్కెట్ కమిటీ చైర్మన్ పుప్పాల శంకర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నల్ల జీవన్‌రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ రామడుగు శైలజారమేశ్రావు, జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు రఫీక్ హైమద్, నాయకులు ఆకుల లచ్చన్న, కుమ్మరి రంజిత్, కట్ల సాగర్, హసీబ్, రాజేశ్, బాలు, నరేశ్, సుద్దాల జగన్, తిరుపతిరెడ్డి, స్టీఫెన్, పీఏసీఎస్ సీఈవో రాజేందర్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
పెంబి, మే 6: మండల కేంద్రంలోని మ్యాక్స్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మక్క కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే రేఖానాయక్ ప్రారంభించారు. డీ-28 కూలిపోవడంతో మండల కేంద్రంలోని భీమన్న చెరువుకు సాగు నీరు రాక భూములు బీడుగా ఉన్నాయని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి కాలువకు మరమ్మతు చేపట్టి సాగునీరందించేలా చర్యలు తీసుకోవాలని సూ చించారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుప్పాల శంకర్, మాక్స్ సొసైటీ అధ్యక్షుడు సల్లా రామేశ్వర్ రెడ్డి, సర్పంచ్ సుధాకర్, నాయకులు గాండ్ల శంకర్, పుప్పాల రవి, విలాస్, రైతులు రాజేందర్, శంకర్ సుధాకర్, రాజలింగు పాల్గొన్నారు.