ఆదిలాబాద్, జూలై 11 ( నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ జిల్లాలోని పెన్‌గంగా నది పరివాహక ప్రాంతాల నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు మైనింగ్ అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదిలాబా ద్ ఎంపీ జీ నగేశ్ సూచించారు. శుక్రవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన దిశ స మావేశంలో ఆయన మాట్లాడారు. పెన్‌గంగా నుంచి కోట్ల రూపాయల ఇసుక అక్రమ రవా ణా జరుగుతున్న అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాండ్బజార్లు ఏర్పాటు చే సి ఇసుక విక్రయాలు జరిగేలా చూడాలన్నా రు. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న రహదారులు, వంతెన నిర్మాణాలను వేగవంతం చేయాలని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో అవసరమైన పనులు చేయలన్నారు.
కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న పీఎంఈజీపీ పథకం పొందేందుకు పేదలకు సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారిందని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. రుణాల మంజూరులో బ్యాంకర్లు సిబిల్ చూడడంతో పేదలు పథకం అందక నష్టపోతున్నారని, ఈ నిబంధనలు సడలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. జాతీయ రహదారి 44పై అండర్ బ్రిడ్జిల వద్ద లైట్లు లేకపోవడంతో రాత్రి సమయంలో ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు.
రోడ్డు క్రాసింగ్ వద్ద స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలన్నారు. బోథ్ నియోజకవర్గంలో పలు గ్రామాల్లో బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులు ఈ సమస్య నివారణకు కృషి చేయాలని సూచించారు. ఇచ్చోడ, బోథ్ మార్కెట్‌యార్డుల్లో కొత్తగా గోదాం నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించారని అవి ఏ దశలో ఉన్నాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ రాజర్షి షా, డీఎఫ్‌వో ప్రశాంత్ పాటిల్, అడిషనల్ కలెక్టర్ శ్యామలాదేవి, డీఆర్డీవో రవీందర్ పాల్గొన్నారు.
-బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్