ఆదిలాబాద్ : ఇసుక అక్రమ రవాణా వానొచ్చినా, వరదొచ్చినా ఆగడం లేదు. పట్టించుకునే వారు లేకపో వడంతో ఇసుక మాఫియా ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతున్నది. తాజాగా ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలతో వాగులు వరదలై పారుతున్నాయి. అయినా కూడా కొందరు అడ్డు అదుపు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
రెబ్బెన మండలంలోని పులికుంట వాగు సమీపంలో అనుమతులు లేకున్నా ఓ ముఠా ఇసుక రవాణా చేస్తూ కోట్లు దండుకుంటున్నది. వర్షాలకు జిల్లా అంతా అతలాకుతలం అవుతున్నా జోరుగా ఇసుక దందా సాగుతుండటంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను అడ్డుకోవాలని కోరుతున్నారు.
వానొచ్చినా, వరదొచ్చినా ఆగని అక్రమ ఇసుక రవాణా దందా
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షంతో వాగులు వరదలై పారుతున్నా, అడ్డు అదుపు లేకుండా సాగుతున్న అక్రమ ఇసుక రవాణా
రెబ్బెన మండలంలోని పులికుంట వాగు సమీపంలో అనుమతులు లేకున్నా ఇసుక రవాణా చేస్తున్న ముఠా
వర్షాలకు జిల్లా అంతా అతలాకుతలం… pic.twitter.com/Qm8G2e70GB
— Telugu Scribe (@TeluguScribe) August 17, 2025