బజార్హత్నూర్, జూలై 3 : రాష్ట్రంలో అత్యంత నిర్లక్ష్యానికి గురవుతున్నది కౌలు రైతులేనని, వారికి వెంటనే గుర్తింపు కార్డులిచ్చి సంక్షేమ పథకాలు అందించాలని రైతు స్వరాజ్య వేదిక జిల్లా అధ్యక్షుడు సంగెపు బొర్రన్న డిమాండ్ చేశారు.
శుక్రవారం మండలంలోని దేగామ గ్రామానికి చెందిన కౌలు రైతులను కలిసి సమస్యలు తెలుసుకున్నారు. 2011 భూ ఆధికృత వాస్తవ సాగుదారుల చట్టాన్ని అమలు చేసి కౌలు రుణార్హత కార్డులివ్వాలని, సమస్యలు పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్, షారుఖ్, శ్రీకాంత్, పోశెట్టి, చిన్న భోజన్న, అరుణ్, అశోక్, రాకేశ్, భూమన్న పాల్గొన్నారు.