Asifabad | ఆసిఫాబాద్, ఆగస్టు 13 : వాతావరణ శాఖ సూచన మేరకు జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించడం జరిగిందని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా ఇంచార్జ్ విద్యాశాఖ అధికారి దీపక్ తివారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు రావాలని, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, నదుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ సముదాయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, తక్షణ సహాయం, సమాచారం కోసం తెలిపారు. జిల్లాలోని లోతట్టు, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల కొరకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రజలు ఆందోళన చెందవలసిన అవసరం లేదని తెలిపారు.