కడెం : కడెం ( Kadem) మండలకేంద్రంతో పాటు, పలు గ్రామాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం (Heavy Rain) పడింది. ఈ వర్షంతో పాటు వడగండ్లు పడడంతో పలు గ్రామాల్లో వరి ( Paddy) , మొక్కజొన్న ( Maize) , పసుపు (Turmeric) పంటలకు నష్టం వాటిల్లినట్లు రైతులు పేర్కొన్నారు.
దాదాపు రెండు గంటల పాటు నిరంతరాయంగా కురిసిన వర్షం వల్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. మొక్కజొన్న, వరి పంటలు నెలకొరిగినట్లు, మామిడి కాయలు రాలి ఆపార నష్టం వాటిల్లిందని రైతులు తెలిపారు. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి.