ఆదిలాబాద్ : జిల్లాలో వానలు దంచి కొడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కాగా, భారీ వర్షాలకు సాత్నాల, మత్తడి ప్రాజెక్టులోకి ఇన్ ఫ్లో పెరగడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని బయటికి వదిలారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగ ఉండాలని అధికారులు సూచించారు.