కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో కలర్ ఫుల్ జోష్ కనిపించింది. శుక్రవారం ఉదయం నుంచి హోలీ సంబురాలు అంబరాన్నంటాయి.
చిన్నా పెద్దా తేడాలేకుండా వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. యువతీయువకులు కేరింతలు కొడుతూ నృత్యాలతో హోరెత్తించారు.
కలెక్టర్లు, పోలీసు ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు రంగులు పూసుకొని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకొన్నారు.