ఉట్నూర్ రూరల్ : మండలంలోని గంగన్నపేట గ్రామంలోని రైస్ మిల్ వద్ద మహిళ సమాఖ్య సంఘం
ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు( Paddy Purchase Centres) కేంద్రాన్ని ఖానాపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్( MLA Vedma Bojju Patel) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని పేర్కొన్నారు. రైతులు తమ పంటలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని సూచించారు.
దళారులను నమ్మి మోసపోవద్దని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సన్నవడ్లకు రూ. 500 బోనస్ ఇస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ రాథోడ్ రవీందర్, జైనూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడ్మేత విశ్వనాథ్ రావు, ఆదిలాబాద్ జిల్లా ఆర్టీఐ మెంబర్ దూట రాజేశ్వర్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు లింగంపల్లి చంద్రయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇక్బాల్,మండల అధ్యక్షుడు అబ్దుల్ ఖయ్యూం,ప్రజా ప్రతినిధులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ సంఘం నాయకులు పాల్గొన్నారు.