హాజీపూర్, ఏప్రిల్ 1 : మండలంలోని దొనబండ గ్రామంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్వంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని జిల్లా అదనపు కలెక్టర్ మోతీలాల్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏ-గ్రేడ్ రకానికి రూ. 2203, బీ-గ్రేడ్ రకానికి రూ. 2183 ధర నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వీవోలు, కమిటీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, ఏప్రిల్ 1 : కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వాజిద్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ గోపాల్, జిల్లా వ్యవసాయాధికారి కల్పన, జిల్లా మార్కెటింగ్ అధికారి గజానంద్తో కలిసి కొనుగోలు కేంద్రాల ఏపీఎంలు, సీసీలతో అదనపు కలెక్టర్ సన్నాహక సమావేశం నిర్వహించారు. ప్రభు త్వ ఆదేశాల మేరకు జిల్లాలోని రైతుల నుంచి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ అన్నారు. ఏ గ్రేడ్ క్వింటాలకు రూ.2,203, కామన్ గ్రేడ్‌కు రూ.2,183 మద్దతు ధర నిర్ణయించామని తెలిపారు.
జన్నారం, ఏప్రిల్ 1 : జన్నారం మండలం మొర్రిగూడ గ్రామంలో తహసీల్దార్ రాజమనోహర్‌రెడ్డి ప్రారంభించారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించి, మద్దతు ధర పొందాలని సూచించారు. దళారులను నమ్మి మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శళికళ, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.
తాండూర్, ఏప్రిల్ 1 : తాండూర్ మండలం అచ్చలాపూర్‌లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏఈవో ధనలక్ష్మి, పీఏసీఎస్ సీఈవో శ్రీనివాస్‌తో కలిసి గిర్దావార్ మురళీధర్‌రావు ప్రారంభించారు. రైతులు ఇబ్బందులు పడకుండా విధులు నిర్వర్తించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది అనిల్, వెంకటేశ్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, ఏప్రిల్ 1 : కోటపల్లి మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో ఆకుల భూమయ్య ప్రారంభించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ సెక్రటరీ రాజు నాయక్, అసిస్టెంట్ సెక్రటరీ పెర్క లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.
నెన్నెల, ఏప్రిల్ 1 : యాసంగి పంట కోసం ప్రభుత్వం ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని నెన్నెల ఏపీఎం విజయలక్ష్మి తెలిపారు. చిత్తాపూర్ గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. గ్రామ సంఘం సభ్యులు, సీసీలు పాల్గొన్నారు.