భైంసాటౌన్, మే 13 : పేదల ఆరోగ్యంపై సర్కారు ప్రత్యేక దృష్టి పెట్టిందని, అనారో గ్యంతో కార్పొరేట్ దవాఖానల్లో లక్షలు ఖర్చు పెట్టినప్పు డు సీఎంఆర్ఎఫ్ ద్వారా ప్రభుత్వం ఆదుకుం టున్నదని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పేర్కొ న్నారు. సీఎంఆర్ఎఫ్ ద్వారా మంజూరైన చెక్కుల ను శనివారం ఎమ్మెల్యే విఠల్ రెడ్డి దేగాంలోని ఆయన నివాసంలో లబ్ధ్దిదారులకు అందజేశారు.
లోకే శ్వరం మండలం పుస్పూర్ గ్రామానికి చెందిన గీతాంజలికి రూ. 17 వేలు, కిష్టాపూర్ గ్రామానికి చెందిన అక్షిత్ రెడ్డికి రూ. 28 వేలు, డీ. మారుతికి రూ. 42 వేలు, రాజురాకు చెందిన సమీన అంజుమ్‌కు రూ. 24 వేలు, కుంటాల మండలం అంబకంటికి చెందిన డీ లక్ష్మీకి రూ. 1.25 లక్షలు, రేణుకకు రూ. 45 వేలు, నర్వాడే హన్మంత్ రావుకు రూ. 2 లక్షల 60 వేలు, సీఎం సహాయ నిధి నుంచి మంజూరయ్యాయి. రాజురా సర్పంచ్ ముత్తాగౌడ్, అంబకంటి సర్పంచ్ ప్రవీణ్, లోకే శ్వరం బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ బండి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.