మందమర్రి, అక్టోబర్ 30 : చెన్నూర్‌లో గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ పేర్కొన్నారు. సోమవారం మందమర్రి మార్కెట్లో హనుమాన్ ఆలయంలో పూజలు చేశారు. అనంతరం 14వ వార్డు, ఒకటవ జోన్ కాలనీ, రామన్ కాలనీ, యాపల్, అంగడిబజార్ ఏరియాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఆయా చోట్ల ఆయన మాట్లాడుతూ పేదల బతుకుల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్ పార్టీనే ఆదరించాలని, మరోసారి తనను ఆశీర్వదిస్తే అభివృద్ధి యజ్ఞం ఇలాగే కొనసాగిస్తానన్నారు. ఎన్నికలు రావడంతో కొందరు నియోజకవర్గంపై ఎనలేని ప్రేమను ఒలకబోస్తూ డబ్బుల సంచులతో వస్తున్నారని, ఈ ఎన్నికల టూరిస్టులను నమ్మి మోసపోవద్దని సూచించారు.
గతంలో మందమర్రి మున్సిపాలిటీ అంధకారంలో ఉండేదని, గత పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలిపానని, కళ్లముందే ప్రగతి కనబడుతుందని చప్పారు. మందమర్రిలో నాయకులు, కార్యకర్తలు చేస్తున్న ప్రచారం చూస్తుంటే.. సంతోషం కలుగుతుందని, గెలుపు ఖాయమనే ధీమా ఏర్పడుతుందన్నారు. రాష్ట్ర, ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కే.చంద్రశేఖర్‌రావు నవంబర్ 7న మందమర్రిలో నిర్వహించే ప్రగతి నివేదన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 3న చెన్నూర్ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిపై సమగ్రంగా రూపొందించిన పుస్తకాలను ఆవిష్కరించి పంపిణీ చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ పరిశీలించి రానున్న ఎన్నికల్లో నిర్ణయం ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్, టీబీజీకేఎస్, మహిళా విభాగం, యూత్, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు.
చెన్నూర్, అక్టోబర్ 30 : చెన్నూర్ నియోజకవర్గంతో పాటు పట్టణంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను చూసి మరోసారి ఆశీర్వదించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కోరారు. ఆదివారం రాత్రి చెన్నూర్ పట్టణంలో మార్వాడీలు, ఆర్యవైశ్యులతో వేర్వేరుగా నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాల్లో పాల్గొన్నారు. గతంలో గెలిచిన వారు ఏమి చేశారో.. నేను వచ్చాక ఏమి జరిగిందో బేరీజు వేసుకొని ఓటు వేయాలని సూచించారు. చెన్నూర్ పట్టణంలో వంద కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టామన్నారు.
రూ.40కోట్లతో 50 పడకల దవాఖాన భవనాన్ని నిర్మించామని, పట్టణంలోని ప్రధాన రహదారిని విస్తరించి, సెంట్రల్ లైటింగ్, ఫౌంటెయిన్లు ఏర్పాటు చేసి సుందరంగా తీర్చిదిద్దామన్నారు. నిస్వార్థంగా ప్రజా సేవకే అంకితమై పని చేస్తున్న తనను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్ గర్రెపల్లి శాంతారాణి, మార్వాడీకుల పెద్దలు శంకర్‌లాల్ లహోటి, హీరాలాల్, మోతీలాల్, కిషన్‌లాల్, కణ్యలాల్, శ్యాంసుదర్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బత్తుల సమ్మయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రుద్రబట్ల సంతోష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, అక్టోబర్ 30 : క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఆదివారం సాయంత్రం విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ విస్తృతంగా ప్రచారం చేశారు. కనకదుర్గా కాలనీ సమీపంలోని అంగడిబజార్‌లో అంబేద్కర్ విగ్రహానికి పూల వేసిన అనంతరం వారసంతలో జోరుగా ప్రచారం చేశారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో కరపత్రాలను వ్యా పారులకు అందించి కారు గుర్తుకు ఓటు వేయాల ని కోరారు.
అనంతరం ప్రచార రథంపై నుంచి మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో మరోమారు బీఆర్ఎస్ పార్టీ గెలిపించాలని కోరారు. మున్సిపల్ చైర్ పర్స న్ కళ, పట్టణ ఇన్చార్జి గాండ్ల సమ్మయ్య, సీనియ ర్ నాయకుడు, కో-ఆప్షన్ సభ్యుడు ఎండీ యా కూబ్ అలీ, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ పార్టీ రామడి కుమార్, అనిల్‌రావు, యువ నాయకులు గంగారపు సత్యపాల్, ఎర్రబెల్లి రాజేశ్ పాల్గొన్నారు.