బెల్లంపల్లి : బెల్లంపల్లి ( Bellampalli ) ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ( Junior College ) జిల్లాలోనే అత్యుత్తమ ఫలితాలు (Results ) సాధించడం అభినందనీయమని మంచిర్యాల జిల్లా ఇంటర్మీడియట్ అధికారి కటకం అంజయ్య ( Intermediat Officer Anjaiah ) తెలిపారు. సోమవారం కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన ఫలితాలు సాధించినందుకు అభినందిస్తూ తయారు చేసిన వాల్పోస్టర్, కరపత్రాలను ఆయన విడుదల చేశారు.
గత ఏడాది జిల్లాలోనే అత్యధిక అడ్మిషన్లు చేసిన కళాశాల ఈ ఏడాది కూడా అదే ఒరవడిని కొనసాగించాలని సూచించారు. కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఐసీ తెలుగు మీడియం, ఆంగ్లం మీడియం, ఓకేషనల్ గ్రూప్ ఎంపీహెచ్ డబ్ల్యూ (మహిళ) ఎంఎల్డీ, సీఎస్, ఓఏ గ్రూప్ల్లో అధునాతన పద్ధతిలో ప్రత్యేక బోధన జరుగుతుందని వివరించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు హాస్టల్ వసతి, దూర ప్రాంత విద్యార్థులకు ఆర్టీసీ బస్ సౌకర్యం ఉందని పేర్కొన్నారు.
ప్రాక్టికల్ ల్యాబ్, ఆర్వోఆర్ ప్లాంట్ ద్వారా శుద్ధమైన నీరు, అనుభవజ్ఞులైన లెక్చరర్లచే విద్యాబోధన జరుగుతుందని చెప్పారు. ఎలాంటి ఫీజు లేకుండా అడ్మిషన్లు, ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో పదవ తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఆవుల అంజయ్య, లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.