కాసిపేట : తోటి స్నేహితుడు ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి అండగా నిలిచారు తనతో పదో తరగతి చదివిన స్నేహితులు. మంచిర్యాల జిల్లా( Mancherial district) కాసిపేట (Kasipeta) మండలంలోని కాసిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన గోపి సందీప్ కుమార్( Sandeep Kumar ) గత నెలలో మృతి చెందాడు. దీంతో నాటి పదో తరగతి( Tenth Batch ) బ్యాచ్ స్నేహితులు అంతా కలిసి జమ చేసిన రూ. 20 వేల నగదును మృతి చెందిన స్నేహితుడి కూతురుపై సుకన్య ఎకౌంట్లో జమ చేశారు. అనంతరం హెచ్ఎం సాంబమూర్తి చేతుల మీదుగా అకౌంట్ ఖాతాను అందించారు. మృతి చెందిన స్నేహితుడి కుటుంబానికి అండగా నిలిచిన తోటి స్నేహితుల ఔదార్యాన్ని పలువురు అభినందించారు.