ఇంద్రవెల్లి, డిసెంబర్ 10 : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో మెస్రం వంశీ యుల ఆధ్వర్యంలో నూతన నాగోబా ఆలయ నిర్మాణం పూర్తయ్యింది. తెలంగాణలో ఆదివాసీల అతిపెద్ద రెండో పండుగగా నాగోబా జాతర గుర్తింపు పొందింది. మెస్రం వంశీయులు కొత్త నాగోబా ఆలయ నిర్మాణాన్ని 2018లో ప్రారం భించి, 2022 నాటికి పూర్తి చేశారు. నాగోబా జాతరతో పాటు ఆలయ చరిత్రను భావితరాలకు అందించే లక్ష్యంతో తమ సొంత డబ్బులతో నూతన నాగోబా ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఏమాత్రం పట్టువిడువకుండా ఐకమ త్యంతో ముందుకు సాగుతూ కుటుంబీకుల ద్వారా పెద్ద మొత్తంలో విరాళాలు సేకరించారు. రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయంతో పాటు సతీ దేవత ఆలయం నిర్మాణం చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మెస్రం వంశీ యులు నివాసముండే గ్రామ గ్రామాన ప్రత్యేక సమావేశాలు నిర్వహించి విరాళాలు సేకరించారు. 2 వేల మెస్రం వంశీయుల కుటుంబాల ద్వారా స్థోమతను బట్టి విరాళాలు సేకరించారు. మెస్రం వంశంలోని వ్యవసాయ రైతులకు రూ. 5 వేల చొప్పున, ప్రజాప్రతినిధుల నుంచి రూ. 7 వేల చొప్పున, ప్రభుత్వ ఉద్యోగస్తుల నుంచి రూ. 10 వేల చొప్పున విరాళాలు సేకరించారు. ఇప్పటికీ రూ.4.67 కోట్లు సేకరించినట్లు మెస్రం వంశీ యుల పెద్దలు తెలిపారు.
నాగోబా ఆలయాన్ని ప్రత్యేకమైన గ్రానైట్ రాయితో నిర్మించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూల్ జిల్లా ఆళ్లగడ్డ గ్రామం నుంచి ప్రత్యేక గ్రానైట్ రాయి(బండరాళ్ల)ని తెప్పించి ఆలయా నికి కావాల్సిన స్తంభాలు తయారు చేశారు. వాటిపై పడియోరు (నాగోబా దేవత)కు సంబం ధించిన వివిధ రకాల శిల్పాలు చెక్కించారు. గ్రానైట్ రాయితో చెక్కించిన స్తంభాలు ఆల యాని కి ఏర్పాటు చేశారు. దీంతో నాగోబా ఆలయానికి శిల్ప కళ సంతరించుకుంది. ఆధునిక పద్ధతిలో ఏర్పాటు చేసిన శిల్పకళా సౌందర్యాలు ఉట్టిపడు తున్నాయి. వేల సంవత్సరాల క్రితం మెస్రం వంశీయులు చిన్నగుడిసెలో ఉన్న నాగోబా దేవత కు పుష్య మాసంలో మహా పూజలు నిర్వహిస్తూ వచ్చారు.
ఈ క్రమంలో మెస్రం వంశీయులు 1956లో చిన్న గుడిని నిర్మించుకొని నాగోబా జాతర ఉత్సవాలు నిర్వహించారు. మెస్రం వంశీ యుల విన్నపం మేరకు ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న జీ నగేశ్ అప్పట్లో రూ.3.80 లక్షలతో రెండోసారి నాగోబా ఆలయం తో పాటు గర్భగుడి, సతీదేవత గుడి, ఆలయ మండపం నిర్మింప జేశారు. అప్పటి నుంచి మెస్రం వంశీయులు నాగోబా జాతర ఉత్సవాలు 2018 వరకు ఎంతో వైభవంగా నిర్వహించారు. యేటా నాగోబా జాతర సందర్భంగా భక్తుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని మెస్రం వంశీయు లు నూతన నాగోబా ఆలయాన్ని విశాలమైన ప్రదేశంలో నిర్మించాలని నిర్ణయించుకున్నారు. రూ. 4.67 కోట్లతో నాగోబా ఆలయాన్ని అద్భు తంగా నిర్మింపజేశారు.
ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో నిర్వహించే నాగోబా ఆలయ ప్రారంభోత్సవాలపై మెస్రం వంశీయులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తెలంగాణ, మహా రాష్ట్రలోని మెస్రం వంశీయులు ఉండే గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా కలెక్టర్లతో పాటు ఎస్పీలు, ఐటీడీఏ పీవో, జిల్లా స్థాయిలోని వివిధ శాఖలకు చెందిన అధికారులు, మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, మండలాల ప్రజాప్రతినిధులు, బదిలీపై వెళ్లిన అధికారులు, ప్రముఖలను మెస్రం వంశీయులు కలిసి ఆహ్వాని స్తున్నారు. మెస్రం వంశీయులు ప్రత్యేకంగా బృందం ఏర్పాటు చేసుకొని ఆహ్వాన పత్రికలు పంచుతున్నారు. డిసెంబర్12 నుంచి 18 వరకు ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 9 గంటల వరకు ఆధ్మాత్మిక ప్రవచనాలు, భజన, తదితర పూజ కార్యక్రమాలు వైభవంగా నిర్వహిస్తారు. కాగా, ఇప్పటికే రాత్రీ పగలు తేడాలేకుండా ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు. ప్రత్యేక బారికేడ్లతో పాటు వివిధ రంగుల విద్యుత్ దీపాలు, హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. ఆలయం చుట్టూ ప్రాంతంలో సీసీ నిర్మించారు.
రాష్ట్ర ప్రభుత్వం నాగోబా ఆలయ అభివృద్ధి కోసం రూ. 6 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో మినీస్టేడియంతో పాటు నాగోబా ఆలయంలో ప్రకార మండపం, చుట్టూ రాజా గోపురాలు, ధ్వజస్తంభం, ఆర్చీలవంటివి నిర్మి స్తున్నది. ఇందులో ప్రస్తుతం మినీస్టేడియంతో పాటు ప్రకార మండపం నిర్మాణం కొనసాగు తున్నది. 2018లో ప్రభుత్వం రూ. 95 లక్షల తో దర్బార్ నిర్మాణం, రూ. 35 లక్షలతో గోవా డ్, రూ. 10 లక్షలతో మర్రిచెట్ల వద్ద కోనే రు నిర్మాణం, రూ. 1.80 కోట్లతో ముత్నూర్ నుం చి కెస్లాపూర్ గ్రామం వరకు బీటీ రోడ్డు నిర్మిం చారు. రూ. 5 లక్షలతో ఆలయ ప్రాంతంలో మరుగుదొడ్లు, స్నానపుగదులు పూర్తి చేశారు.
రూ. 4.67 కోట్ల విరాళాలు సేకరిం చి నాగోబా, సతీ దేవత ఆలయాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్మింపజే శాం. మెస్రం వంశీయులతో పాటు భావితరాలకు నాగోబా చరిత్రను అందించడమే మా లక్ష్యం. నూతన నాగోబా ఆలయం నిర్మించాలన్న పెద్దల నిర్ణయాన్ని మెస్రం వంశీయులంతా స్వాగతించారు. గ్రానైట్ రాయితో ఆలయం నిర్మిం చాం. నాగోబా సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా శిల్పాలు చెక్కించాం.
– మెస్రం వెంకట్రావ్పటేల్, మెస్రం వంశీయుల పీఠాధిపతి
నాగోబా ఆలయ ప్రారంభోత్సవాన్ని చరిత్రలో నిలిచేలా వైభవంగా నిర్వహి స్తాం. ఆలయం ప్రారంభోత్సవంతో పాటు విగ్రహ ప్రతిష్ఠాపనకు రూ. 15 లక్షలు ఖర్చు చేస్తున్నాం. ఈ నెల 12 నుంచి 18వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తాం. ప్రతిరోజూ ఆధ్యాత్మిక కార్యక్రమాలతోపాటు భజనలు, కీర్తన లు ఉంటాయి. ఉమ్మడి జిల్లాలోని మండలాల వారీగా మెస్రం వంశీయుల ఆధ్వర్యంతో అన్నదానం చేస్తాం.
– మెస్రం దేవ్రావ్, మెస్రం వంశీయుల ఉద్యోగ సంఘం కార్యదర్శి
మెస్రం వంశీయులు కలిసి కట్టుగా నాగోబా ఆలయం నిర్మించడం గొప్ప విషయం. దేశంలో ఎక్కడాలేని విధంగా నాగోబా ఆలయాన్ని నిర్మింపజేశారు. కొత్త నాగోబా ఆలయాన్ని చూసి మెస్రం వంశీయులు మురిసిపోతున్నారు. సంస్కృతీ సంప్రదాయాలు నిలిచి పోయేలా ఆలయ నిర్మాణం చేశాం. ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
– మెస్రం షేకు, నాగోబా ఆలయ పూజారి