మంచిర్యాలటౌన్, మే 3 : ఆచరణ సాధ్యంకాని హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌ను ఓడించి తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం మంచిర్యాల పట్టణంలోని 28వ వార్డు లక్ష్మీనగర్, వడ్డెరకాలనీల్లో పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పాలనను గాలికి వదిలేసిందని, సాగు, తాగు నీరు ఇవ్వాలన్న ఆలోచనే లేదని, పంటలు ఎండుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. కేసీఆర్ పాలనలో ప్రజలు సంతోషంగా ఉండేవారని, కాంగ్రెస్ పాలనలో అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని వర్గాలను కాపాడుకునే ఏకైక పార్టీ బీఆర్ఎస్ అని, అందుకే పార్లమెంట్ ఎన్నికల్లో కారుగుర్తుకు ఓటు వేసి భా రీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు గాదెస త్యం, అంకం నరేశ్, బీఆర్ఎస్ నాయకులు గోగుల రవీందర్‌రెడ్డి, పల్లపు రాజు, శంకర్, బాపు, తాజుద్దీన్, మహ్మద్ రఫీ పాల్గొన్నారు.
శ్రీరాంపూర్, మే 3 : పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డులో మాజీ మున్సిపల్ చైర్మన్ ఇసంపెల్లి ప్రభాకర్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీబీజీకేఎస్ కేంద్ర నాయకులు కేతిరెడ్డి సురేందర్‌రెడ్డి వాడ వాడలా, ఇంటింటా తిరిగి ప్రచారం చేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం ఎంతో ప్రగతి సాధించిందని, దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని గుర్తు చేశారు.
సింగరేణి స్థలాల్లో నివాసముంటున్న వాటర్ ట్యాంక్ ఏరియాలో 400 మందికి ఇండ్ల స్థలాలు ఇప్పించిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌దేనని కొనియాడారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌కు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ ఆధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య, కార్యదర్శి పవన్, నాయకులు రాజేశ్వర్‌రెడ్డి, తిరుమల్‌రావు, బూరుగు సత్యనారాయణ, రవిగౌడ్, పెట్టం నరేశ్, జనార్దన్, తదితరులు పాల్గొన్నారు.