ఎకరాకి రూ.25 వేలు ఇవ్వాలి
అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్చార్జి మంత్రి రైతుల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంత కార్యక్రమాల్లో నిమగ్నమవడం విచారకరమని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
- మాజీ మంత్రి జోగు రామన్న
ఎదులాపురం, ఆగస్టు 5 : అతివృష్టి కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్న రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్న సమయంలో స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే, రాష్ట్ర ఇన్చార్జి మంత్రి రైతుల సమస్యలను పట్టించుకోకుండా తమ సొంత కార్యక్రమాల్లో నిమగ్నమవడం విచారకరమని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాను కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా అతివృష్టితో పంటలు నీటమునిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇప్పటికే జొన్న రైతులు కూడా సమస్యలు ఎదురొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు రాజకీయ కార్యక్రమాలు పకనపెట్టి రైతుల సమస్యలపై స్పందించాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చే దశలో ఉన్న పంటలు పూర్తిగా దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే క్షేత్రస్థాయిలో సమగ్ర సర్వే నిర్వహించి పంట నష్టాన్ని అంచనా వేసి, రైతులకు ఎకరానికి రూ.25 వేల చొప్పున నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేశారు.
ఈ విషయంలో ప్రజాప్రతినిధులు ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. లేకపోతే రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. గతంలో జొన్న రైతుల సమస్యలపై కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేయగా.. ప్రభుత్వం స్పందించి రూ.40 కోట్లు మంజూరు చేసిందని, మరో రూ.100 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉందని కలెక్టర్ తెలిపినట్లు పేరొన్నారు. ఆ నిధులను కూడా వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు అజయ్, యూనిస్ అక్బాని, గండ్రత్ రమేశ్, చందాల రాజన్న, కుమ్ర రాజు, బట్టు సతీష్, కనక రమణ, ఉమాకాంత్ రెడ్డి, మహేందర్ పాల్గొన్నారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
Yogi Adityanath | నేను రెడీ, అఖిలేష్ రెడీనా.. యూపీ సీఎం యోగీ అదిత్యనాథ్ ప్రతి సవాల్
Villagers Attack | పోలీసులపై గ్రామస్థుల దాడి.. సీఐ, ఏఎస్సైకి గాయాలు
Kohli – Renshaw | కోహ్లీకి ఊహించని షాకిచ్చిన ఆసీస్ బ్యాటర్.. చిరస్మరణీయ శతకంతో పదేళ్ల రికార్డు బ్రేక్..!
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

