కెరమెరి, జూలై 18 : మనది మూడు పంటల నినాదం అయితే.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంట్ విధానమని.. ఏ సర్కారు కావాలో ఆలోచించుకోవాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని ఖైరి, ధనోర, సాంగ్వీ రైతు వేదికల్లో రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి ఆయన పాల్గొన్ని మాట్లాడారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాటలతో కరెంట్‌పై కాంగ్రెస్ పార్టీ విధానం బహిర్గతమైందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేస్తుంటే.. ఓర్వలేని కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు కొండ్రా జగ్గగౌడ్, ఎంపీపీ పెందోర్ మోతీరాం, వైస్ ఎంపీపీ సయ్యద్ అబుల్ కలాం, ఎంపీటీసీ సక్కారాం, సర్పంచులు కుమ్రం నాణేశ్వర్, తొడసం జగన్నాథ్రావ్, విజయలక్ష్మి, మడవి చిలక, అదే నారాయణ, తలండి భీంరావు, రైతు బంధు మండలాధ్యక్షుడు కేంద్రే బాలాజీ, బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
మాటలు వెనక్కి తీసుకోవాలి..
కుభీర్, జూలై 18 : కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు 24 గంటల ఉచిత్ విద్యుత్ ఎందుకని, 3 గంటల కరెంటు సరిపోతుందని అనడం సిగ్గు చేటు. యావత్ తెలంగాణ రైతాంగానికి ముందు ఆయన క్షమాపణలు చెప్పాలి. రెండు, మూడు పంటలు పండిస్తూ సర్కారు అందిస్తున్న బీమా, రైతుబంధు, కొరత లేని ఎరువులతో పాటు చెరువులకు మరమ్మతులు చేసి రైతులు ఆర్థికంగా ఎదగడానికి తొమ్మిదేళ్లుగా సీఎం కేసీఆర్ రాత్రింబవళ్లు కష్టపడుతున్నారు. రైతులను కించ పరిచే వ్యాఖ్యల్ని చేసి అగౌరవ పర్చిన రేవంత్ మాటలు వెనక్కి తీసుకోవాలి.
– పోతుల నాగరాజు, రైతు, నిగ్వ
ఆర్థికంగా బలపడ్డారు..
కుభీర్, జూలై 18 : సీమాంధ్ర ప్రభుత్వాల హ యాంలో దివాల తీసిన రైతులకు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎరువుల కొరత లేకుండా చేశారు. చెరువులను మరమ్మతు చేయించారు. పెట్టుబడి సాయం కింద రైతులకు ఎకరాకు రూ.10 వేలు అందిస్తున్నారు. రైతుబీమాతోపాటు వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంటు ఇచ్చి రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిన ఘనత కేసీఆర్ సార్‌దే. ఆయనను తెలంగాణ సమాజం, రైతాంగం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. మూడు గంటల కరెంటు మూడు ఇసాలకు సరిపోదు. ఫాల్తు మాటలు మాట్లాడి రైతులను ఆగం చేస్తున్నరు.
– లాలేశ్, రైతు, సాంగ్వి.
లో వోల్టేజీతో మోటార్లు కాలిపోయేవి..
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు రై తులు కరెంటు కోసం బాగా ఇబ్బందులు పడేవారు. వచ్చే మూడు నాలుగు గంటల కరెంటు ఎప్పుడు వస్తుందో రాదో తెలియకపోయేది. ఎంతో కష్టపడి సాగు చేసిన పంటలకు రైతులు కరెంటు లేక నీళ్లు ఇచ్చేటోళ్లు కాదు. లో వోల్టేజీతో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేవి. రాత్రిపూట సాగుకు నీళ్లు ఇవ్వడానికి బావుల వద్దకు పోవాల్సి వచ్చేది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్కారు 24 గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నది. దీంతో రైతులు రెండు పంటలు వేస్తున్నారు.
– జ్యోతిరాం, రైతు, చించూఘాట్, ఆదిలాబాద్ రూరల్ మండలం