తాండూర్: రైతులు దళారులను ఆశ్రయించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు (Procurement Centers) తరలించాలని తాండూర్ సింగిల్ విండో చైర్మన్ సుబ్బ దత్తుమూర్తి ( Dattumurthy ) కోరారు. మండలంలోని తాండూర్ గ్రామపంచాయతీ పరిధిలో గురువారం పీఏసీఎస్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఆయన మాట్లాడుతూ కొనుగోలు కేంద్రం ఏర్పాటు ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరడంతో పాటు మద్దతు ధర లభిస్తుందన్నారు. రైతులు ప్రైవేట్ వారిని, దళారులను ఆశ్రయించకుండా పీఏసీఎస్ కేంద్రాల్లోనే విక్రయించి లబ్ది పొందాలని కోరారు.
ధాన్యం విక్రయాల్లో రైతులు నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు.
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సకాలంలో ధాన్యం తూకం, రవాణా సౌకర్యాలు కల్పించాలని అధికారులు, సిబ్బందికి సూచించారు. లారీలు సమయానికి అందుబాటులో ఉంచి ధాన్యం తరలింపులో ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యానికి చెల్లింపులు త్వరితగతిన జరగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గిర్దావార్ బొలిశెట్టి పద్మజ, పీఏసీఎస్ సెక్రటరీ అనిల్ కుమార్, పాలకవర్గం సభ్యులు, అధికారులు నాయకులు, పీఏసీఎస్, వైద్య సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.