Farmers Protest | సీసీఐ పత్తి కొనుగోళ్లు చేయాలని జాతీయ రహదారిపై రైతుల ధర్నా
Farmers Protest | సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు చేయాలని పత్తి రైతులు ఆందోళన చేపట్టారు.
తాండూర్ : సీసీఐ ( CCI ) ద్వారా పత్తి కొనుగోళ్లు ( Cotton Purchase ) చేయాలని తాండూర్ మండలం రేపల్లెవాడ సమీపంలోని జిన్నింగ్ మిల్లుల వద్ద జాతీయ రహదారిపై పత్తి రైతులు ఆందోళన ( Farmers Protest ) చేపట్టారు. నాణ్యత లోపం పేరుతో అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు ఆరోపించారు. పుచ్చు , తేమ ఉందని కొర్రీలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా సీసీఐ అధికారులు పత్తి నాణ్యత చూసి షరతులు లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తూ రహదారిపై బైటాయించారు. ఈ నెల 20వ తేదీలోగా సీసీఐ ద్వారా పత్తిని కొనుగోళ్లు నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటన చేసిన నేపథ్యంలో ప్రభుత్వం పత్తి రైతుల ఆవేదనను అర్ధం చేసుకొని పత్తి కొనుగోలు చేయాలని కోరారు.
సీసీఐ ఇన్చార్జి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ రైతులు తీసుకువచ్చిన పత్తిలో చాలా వరకు పురుగుఉంటుందని, నాణ్యమైన పత్తి తీసుకురానందుకే కొనుగోలు చేయడం లేదని తెలిపారు. జాతీయ రహదారిపై రైతులు ఆందోళన చేస్తున్న విషయాన్ని తెలుసుకున్న తాండూర్ ఏఎస్సై రాజమౌళి సంఘటన స్థలానికి చేరుకొని రైతులు, సీసీఐ అధికారులతో మాట్లాడి దర్నాను విరమింప చేశారు.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

