నార్నూర్ : రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నామని సహకార సంఘం( Cooperative Societies ) చైర్మన్ ఆడే సురేష్ ( Ade Suresh) అన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో సహకార వారోత్సవాలను నిర్వహించారు. సందర్భంగా మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సహకార జెండాను ఆవిష్కరించారు.
చైర్మన్ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం సహకార సంఘాలు ఏర్పడడంతో గ్రామాల్లోని రైతులకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని అన్నారు. రైతులు సహకార సంఘం సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీఈవో ఆడే గణేష్, మాజీ సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, డైరెక్టర్లు దుర్గ కాంతారావు, సురేష్, ప్రకాష్, వసంత్, యశ్వంత్ రావు, దిగంబర్, కోరల మహేందర్, మోహన్, నజీర్ తదితరులున్నారు.