ఉట్నూర్, మార్చి 2 : ఉపాధ్యాయులు శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని ఐటీడీఏ పీవో అంకిత్ సూచించారు. ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాద్యమం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్ర మాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ ఎంపిక చేసిన ఆశ్రమ పాఠశాలల ఎస్జీటీలు, హెచ్ఎంలకు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశా లల్లో విద్యార్థులకు విద్యనందించాలని పేర్కొ న్నారు. సామాజిక అవసరాలకు అనుగుణంగా విద్యాబోధన మెరుగు పడాలని, శిక్షణ ఈ నెల 10వరకు జరుగుతుందని పేర్కొన్నారు. ఎంపిక చేసిన ఉపాధ్యాయులు శిక్షణకు హాజరు కావాలని సూచించారు. డీడీ సంధ్యారాణి, ఆర్సీవో గంగా ధర్, ఏసీఎం యూ జగన్, క్రీడల అధికారి పార్థసారధి జీసీవోడీ చాయ పాల్గొన్నారు.