“ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను పాలించిన కాంగ్రెస్ పార్టీ రైతాంగాన్ని ఆంధకారంలోకి నెట్టేసింది. వ్యవసాయానికి తొమ్మిది గంటలు కూడా కరెంటు ఇవ్వకుండా రైతుల ఉసురుపోసుకుంది. పగలు నాలుగు గంటలు ఇచ్చి.. రాత్రి ఐదు గంటలు ఇవ్వడంతో రైతులు అవస్థలు పడ్డారు. ఇటువంటి కాంగ్రెస్ పార్టీ కావాల్నా.. రైతులకు 24 కరెంటు ఇస్తూ మేలు చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ కావాల్నా రైతులు ఆలోచించాలి” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా సోన్ మండలంలోని ఎల్లపెల్లి రైతు వేదికలో రైతు సభ నిర్వహించారు. ఈ సమావేశానికి మంత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాగా.. 24 గంటల కరెంటును నిరంతరంగా కొనసాగించాలని కోరుతూ రైతు సమన్వయ కమిటీ నిర్మల్ జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్రెడి ్డ తీర్మానం ప్రవేశపెట్టగా .. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు రైతుల హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవ తీర్మానం చేశారు. అలాగే.. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అంకోలిలో ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ నియోజకవర్గంలోని ఇచ్చోడలో ఎమ్మెల్యే రేఖానాయక్, గుడిహత్నూర్‌లో ఎమ్మెల్యే బాపురావ్, నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని నిగ్వలో ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి పాల్గొన్నారు.
– ఆదిలాబాద్(నమస్తే తెలంగాణ)/సోన్, జూలై 18
సోన్, జూలై 18 ః ‘మాది మూడు పంటల నినాదం.. కాంగ్రెసోళ్లది మూడు గంటల కరెంటు నినాదం.. అధికారంలో ఉన్నప్పుడు తొమ్మిది గంటలు సక్రమంగా కరెంటు ఇవ్వలేని కాంగ్రెసోళ్లు సీఎం కేసీఆర్ 24 గంటల కరెంటు ఇస్తే జీర్ణించుకోలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్న రేవంత్‌రెడ్డి రైతులను కించపరిచే విధంగా మాట్లాడడం సొంత పార్టీలోనే గందరగోళం రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి తప్పకుండా ప్రజలు, రైతులు బుద్ధి చెప్పుతారు. మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ అధికారంలోకి వస్తారు.’ అని కాంగ్రెస్ తీరుపై రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంగళవారం నిర్మల్ మండలంలోని ఎల్లపెల్లి రైతు వేదికలో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ రైతుల సమక్షంలో రేవంత్ తీరును నిరసిస్తూ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆత్మరక్షణలో పడిందని, ఆ పార్టీలో ఎవరూ ఏమి మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి నెలకొందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో కరెంటు కోసం పొలాల వద్ద కాపలా కాసే పరిస్థితి ఉండేదని, ఇప్పుడు రైతు మోటారు చాలు చేసి ఇంటికొస్తే పొలమంతా నీటితడితో నిండిపోతోందని రైతులను ఉద్దేశించి అన్నారు.
రాష్ర్టానికి, రైతులకు నష్టం కలిగించే కాంగ్రెస్ కావాల్నో.. రైతులకు మేలు చేసే బీఆర్ఎస్ పార్టీ కావాల్నో ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. రైతు సంక్షేమ పథకాలను అన్ని రాష్ర్టాల్లో అమలు చేయాలన్న డిమాండ్ ఏర్పడుతోందని, తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే అమలు చేసేందుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కానుందని పేర్కొన్నారు. వ్యవసాయం గురించి తెలియని రేవంత్ ఉచిత కరెంటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కరెంటుపై ఏ ఒక్క రైతు కూడా ఇప్పటివరకు ధర్నా చేసిన సందర్భాలు లేవన్నారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారంలోకి వెళ్తుందని, రైతులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. కేంద్రం రైతు వ్యతిరేక విధానాల వల్ల దేశంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటే.. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం 24 గంటల కరెంటు, రైతు పథకాల అమలుతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. గత తొమ్మిదేళ్లలో సాగు గణనీయంగా పెరిగి అన్నపూర్ణమ్మగా మారిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటిని ఎస్సారెస్పీకి మళ్లించడం జరుగుతోందని, భవిష్యత్‌లో శ్రీరాంసాగర్ కింద రెండు పంటలకు నీరందుతుందని రైతులకు వివరించారు.
హర్షధ్వానాల మధ్య తీర్మానం ఆమోదం..
రైతులకు 24 గంటల కరెంటు అమలు ప్రక్రియను నిరంతరంగా కొనసాగించాలని కోరుతూ రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామ్రెడ్డి ఆధ్వర్యంలో చేసిన తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు రైతులు హర్షధ్వానాల మధ్య ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. రేవంత్‌రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్కచేయకుండా కాంగ్రెస్ నేత రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను నిరసిస్తూ రైతులు పెద్ద ఎత్తున రైతు వేదిక వద్దకు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మాజీ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, నిర్మల్ ఎఫ్ఏసీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, ఆత్మ చైర్మన్ గంగారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి, ముఠాపూర్ పీఏసీఎస్ చైర్మన్ బోండ్ల గంగాధర్, వైస్ చైర్మన్ రాజారెడ్డి, నిర్మల్ మండల రైతు బంధు సమితి కన్వీనర్ మల్లేశ్ యాదవ్, అడెల్లి కమిటీ చైర్మన్ చందు, సర్పంచ్ అల్లోల రవీందర్‌రెడ్డి, భూమేశ్, నాయకులు ధర్మాజీ శ్రీనివాస్ పాల్గొన్నారు.