కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ఆవరణలో ఈ నెల 5న కుక్కల దాడిలో ( Dog attack ) గాయపడ్డ చిన్నారి కేసును కోర్టు సుమోటోగా ( Suomoto case ) స్వీకరించింది. ఆ ఘటనలో చొప్పరి అక్షిత అనే 1వ తరగతి చిన్నారి తీవ్రంగా గాయపడింది . కుక్కల దాడి చేసిన ఘటనపై బెల్లంపల్లి కోర్టు సుమోటో కేసుగా స్వీకరించి మంచిర్యాల జిల్లా కలెక్టర్, మండల పంచాయతీ అధికారి, ముత్యంపల్లి పంచాయతీ కార్యదర్శికి సోమవారం నోటీసులు జారీ చేసింది.
కుక్కల బెడద, నిర్లక్ష్యం, ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని, సంబంధించి అధికారుల నిర్లక్ష్యమే కారణమంటూ కోర్టు కేసు నమోదు చేసింది. సెప్టెంబర్ 9వ తేదీ ఉదయం 10:30 గంటలకు లీగల్ సర్వీసెస్ కమిటీ ముందు హాజరు కావాలని కోర్టు నోటీసులో పేర్కొంది .