ఎదులాపురం, డిసెంబర్ 13 : టీబీ నివారణలో వైద్యసిబ్బంది నిర్లక్ష్యం చేయవద్దని డీఎంహెచ్‌వో రాథోడ్ నరేందర్ సూచించారు. బుధవారం ఆదిలాబాద్‌లోని జిల్లా టీబీ నివారణ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనుమానితులను గుర్తిస్తూ వెంటనే నిర్ధారణ పరీక్షలు చేయాలన్నారు.
మందులు ఇచ్చిన అనంతరం మళ్లీ వారికి నిర్ధారణ పరీక్షలు చేయించి తదుపరి మందులు అందిస్తూ ఉండాలన్నారు. జిల్లా టీబీ రహిత సమాజ నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా టీబీ నివారణ కార్యక్రమ అధికారి ఎస్ సాయిప్రియా, ట్రీట్మెంట్ యూనిట్ డాక్టర్ ప్రసాద్, వైద్యులు సంజీవ్, వినోద్‌కుమార్, శ్రీకాంత్, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.