Seasonal Deseases | నార్నూర్, జూలై 8 : వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని అడిషనల్ డీఎంహెచ్ఓ కుడ్మెత మనోహర్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్య వివరాలతోపాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పారిశుధ్యం లోపించకుండా అవగాహన కల్పించాలన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. సమస్యలుంటే నేరుగా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. ఈ సమావేశంలో వైద్యాధికారి జితేందర్ రెడ్డి, సుంకన్న, వైద్య సిబ్బంది తులసీదాస్, నాందేవ్, చరణ్ తదితరులు ఉన్నారు.
Amberpet | రహదారుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు : ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Trade Deal | త్వరలో అమెరికాతో భారత్తో వాణిజ్య ఒప్పందం.. కీలక సూచనలు చేసిన జీటీఆర్ఐ..
Horror | దెయ్యం వదిలిస్తామంటూ నాలుగు గంటలు చిత్రవధ.. దెబ్బలు తాళలేక మహిళ మృతి..!