ఎదులాపురం, జూన్ 11 : మధ్యాహ్న భోజన కార్మికులు దీర్ఘకాలికంగా ఎదుర్కొంటున్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర కమిటీ సభ్యుడు కుంటాల రాములు డిమాండ్ చేశారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం మధ్యాహ్నం భోజన పథకం కార్మికులతో కలిసి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. మధ్యాహ్న భోజన కార్మికులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలని, గుర్తింపు కార్డులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమస్యలను పరిష్కరించని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.