ఆరాధ్య దైవం.. ఆధ్యాత్మిక వైభవం
మండలంలోని కేస్లాపూర్ నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలతోపాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి
- నాగోబా ఆలయ ప్రారంభోత్సవ వేడుకల్లో రెండో రోజు భక్తి ప్రవచనాలు
- మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు
- తరలివస్తున్న భక్తులు
- ఆలయ ప్రాంగణంలో వలంటీర్ల సేవలు
- రూ. 6 లక్షలతో జనరేటర్ సౌకర్యం ఏర్పాటు
మెస్రం వంశీయుల ఆరాధ్య దైవం నా గోబా చెంత పూజలతో పాటు ఆధ్యా త్మిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం ప్రత్యేక ప్రవచ నాలు వినిపించారు. కాగా, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండగా, ఎలాంటి ఇ బ్బందులు తలెత్తకుండా వలంటీర్లు సేవ లందిస్తున్నారు. కాగా, ఆలయానికి రూ. 6 లక్షలతో ప్రత్యేకంగా జనరేట ర్ను కొ నుగోలు చేశారు. తమ సంప్రదాయం ప్ర కారం వేడుకలు కొనసాగిస్తున్నారు.
– ఇంద్రవెల్లి, డిసెంబర్ 13
ఇంద్రవెల్లి, డిసెంబర్13: మండలంలోని కేస్లాపూర్ నాగోబా విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలతోపాటు ఆలయ ప్రారంభోత్సవ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో రెండో రోజు మంగ ళవారం ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. ఆలయం చుట్టూ రంగురంగుల టెంట్లతో పాటు విద్యుత్ అలంకరణ, తాగునీటి వసతి, సీసీ కెమెరాలు,ఏర్పాటు చేశారు. ఆలయ ప్రాంగణంలో 50 టెంట్లు వేయించారు.
నార్నూర్ మండలంలోని గుంజాల, జమడా, ఖైర్‌దాట్వా, పుసిగూడ, జైనూర్ మండలంలోని డబోలి, ఇంద్రవెల్లి మండలంలోని కెస్లాపూర్‌కు చెందిన మెస్రం వంశీయులు ప్రత్యేక టెంట్లను తీసుకొచ్చారు. విద్యుత్ సమస్యలు తలెత్త కుండా విద్యుత్ జనరేటర్‌ను రూ. 6 లక్షలతో కొనుగోలు చేశారు. ఆలయ ఆవరణలో రాత్రింబవళ్లు ఆధ్మాత్మిక ప్రవచనాలతోపాటు కీర్తన్, భజన కార్యక్రమాలు నిర్వహిస్తుండ డంతో, జనరేటర్‌ను అందుబాటులో ఉంచారు.
వలంటీర్ల విస్తృత సేవలు
నాగోబా ఆలయానికి వస్తున్న మెస్రం వంశీయులతోపాటు భక్తులకు యూత్ వలంటీర్లు సేవలందిస్తున్నారు. ఆ లయ ఆవరణలో పారిశుధ్యం లోపించకుండా చెత్తను తొ లగిస్తున్నారు. ఆలయ పరిసరాలను శుభ్రం చేస్తున్నారు. వంశీయులకే కాకుండా భక్తులకు కూడా ఈ వలంటీర్లు భో జనాలు వండి పెడుతున్నారు. క్యూలైన్లు ఏర్పాటు చేసి భ క్తులను పూజలకు పంపుతున్నారు. 24గంటలు వలంటీర్లు అప్రమత్తంగా ఉంటు ప్రజలకు సేవలు అందిస్తున్నారు.
ఆలయ అవరణలోని గోవాడ్ ప్రాంతంలో మెస్రం వంశీయులు ట్రాక్టర్ బ్లేడ్‌తో భూమి చదును చేయిస్తున్నారు. కెస్లాపూర్ గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో భక్తులకు తాగునీటిని అందించారు. కాగా, ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మెస్రం వంశీయుల ప్రత్యేక కార్యక్రమాలతో సందడి నెలకొంది.
Read Today's Latest Adilabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
BRS Canada | కాంగ్రెస్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాం : బీఆర్ఎస్ కెనడా విభాగం
Army Officer’s Wife Shared Info | చైనాతో సహా విదేశీ ఏజెంట్లకు.. కీలక సమాచారం అందించిన ఆర్మీ అధికారి భార్య
Bathukamma Celebrations | మలేషియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
పత్రికా స్వేచ్ఛ పేరుతో నిరాధార ఆరోపణలు తగవు: బీఆర్ఎస్ స్విట్జర్లాండ్ ప్రతినిధి శ్రీధర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

