ఇంద్రవెల్లి, జూలై 7 : వ్యవసాయ రుణాల కోసం బ్యాంక్‌కు వెళ్లిన ఆదివాసీ గిరిజన రైతులకు చెందిన భూములతోపాటు రైతుల వివరాలు భూభారతిలో లేకపోవడంతో బ్యాంక్ అధికారులు వ్యవసాయ రుణాలు ఇవ్వడం లేదని మండల ఆదివాసీ సర్పంచ్‌లు మెస్రం భీంరావ్, మెస్రం తుకారామ్, కోవా రాజేశ్వర్, కోవా లాల్‌షావ్, రిటే విటల్లు ఆరోపించారు.
మంగళవారం ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల కేంద్రంలోని బ్యాంక్‌ను సర్పంచ్‌లు పూసం ఆనంద్‌రావ్, మడావి భూజంగ్రావ్, పూర్కా మాదవ్‌రావ్, పేందూర్ లక్ష్మన్, పూసం కిషన్రావ్, పేందూర్ జంగుబాయి రైతులతో కలిసి బ్యాంక్‌ను సందర్శించి బ్యాంక్ అధికారులను భూభారతి అన్లైన్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భూభారతి ఆన్లైన్లో రైతులతోపాటు భూముల వివరాలు కనిపించడం లేదని బ్యాంక్ అధికారులు తెలుపడం జరిగిందన్నారు. అధికారులు ఈ విషయంపై దృష్టి సారించి ఆదివాసీ గిరిజన రైతులకు న్యాయం చేయాలని సర్పంచ్‌లు కోరారు.