రాఘవ అక్రమ మైనింగ్‌పై విచారణ
మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందినదిగా భావిస్తున్న రాఘవ కంపెనీపై అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది.
- కేంద్ర బొగ్గు గనుల శాఖకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు
హైదరాబాద్, జూలై 30 (నమస్తేతెలంగాణ): మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి చెందినదిగా భావిస్తున్న రాఘవ కంపెనీపై అక్రమ మైనింగ్ ఆరోపణల నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్ అయింది. ఎనిమిది వారాల్లోగా చర్యలు తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యదర్శి ని గురువారం ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మానస హిల్స్‌లో అక్రమ మై నింగ్ చేస్తున్నదని హక్కుల న్యాయవాది రామారావు ఇమ్మానేని ఫిర్యాదుపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. దీనిపై విచారణ చేపట్టి ఎనిమిది వారాల్లో నివేదించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ కార్యదర్శికి నిర్దేశించింది.
ఫిర్యాదుదారుకు సైతం వివరాలు తెలియజేయాలని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో పర్యావరణ, గనులు, హెచ్ఎండీఏ, కాలుష్య నియంత్రణ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టడంపై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించనున్నది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో ఎంఎండీఆర్ చట్టం కింద చర్యలు తీసుకోవాల్సిన అనివార్య పరిస్థితి తలెత్తింది. రెవెన్యూ, గనుల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, హెచ్ఎండీఏ ఎందుకు మౌనం వహించాయనే విషయం విచారణలో బహిర్గతం కానున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

