నాగర్‌కర్నూల్/కొల్లాపూర్, జూలై 30 : సమయం లేదు మిత్రమా.. ఆలస్యం చేస్తే ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం నెలకొన్నది. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ముగింపునకు కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంకా నాలుగు రోజులు మాత్రమే సమయం ఉండడంతో అప్రమత్తం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఎన్నికల సంఘం ఎన్యూమరేషన్ ఫామ్స్ సేకరించేందుకు ఇదివరకు జూలై 24 వరకు పెట్టిన గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించింది. మళ్లీ తేదీలను పొడిగించేందుకు అవకాశం లేకపోవచ్చు. ఓటు విషయంలో అలసత్వం వహిస్తే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉన్నది. ఇటీవల ఎన్నికలు జరిగిన రాష్ర్టాల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఓటును కోల్పోకుండా ఉండాలంటే ఈ ఐదు రోజులు అత్యంత కీలకమైనవిగా ఓటర్లు భావించాలి. మీరు ఎక్కడ ఉన్నా.. మీ ఓటు హక్కు కోసం సమయం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి.
కొల్లాపూర్ నియోజవకవర్గంలో 2,41,642 ఓట్లు, అచ్చంపేట నియోజకవర్గంలో 2,48,362 ఓట్లు, నాగర్‌కర్నూల్ ఈఆర్వో పరిధిలో 2,40,571 ఓట్లు ఉన్నాయి. అయితే డిజిటలైజేషన్ జరుగుతున్న తీరుతో ప్రతి సిగ్మెంట్లో 30 నుంచి 40 వేల ఓట్ల దాక గాయబ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఓటర్లు గాయబ్ అయినా లిస్ట్‌లో పడకుం డా జాగ్రత్తలు తీసుకోవాలి.
డిజటలైజేషన్లో నాగర్‌కర్నూల్ జిల్లా చివరి దశకు చేరుకున్నది. కొల్లాపూర్ ఈఆర్వో పరిధిలో 90 శాతం పూర్తయింది. అచ్చంపేట ఈఆర్వో పరిధిలో 80.74 శాతం, నాగర్‌కర్నూల్ ఈఆర్వో పరిధిలో 80 శాతం పూర్తయైంది. నిర్ణీత గడువులోగా ఏఎస్డీ శాతాన్ని కూడా వెల్లడించేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ తుది దశకు చేరింది. గడువును ఆగస్టు 3వ తేదీ వరకు పొడిగించగా.. అధికారులు నిరంతర కృషితో నిర్ణీత గడువులోగా ఓటరు మ్యాపింగ్ పూర్తి కావడంతోపాటు, ఎన్యూమరేషన్ పంపిణీని పూర్తి చేశారు.
బీఎల్వోలు సేకరించిన ఫామ్స్ ఎన్నికల అధికారులు పరిశీలన చేసిన అనంతరం డిజిటల్ డేటా బేస్‌లో నమోదు చేస్తున్నారు. డిజిటలైజేషన్ పూర్తి అయినా వెంటనే డూప్లికేట్, మరణించిన, శాశ్వతంగా వేరే చోటుకు మారిన ఓటర్ల వివరాలను గుర్తిస్తారు. ఓటర్లు జాగ్రత్త పడకపోతే డూప్లికేట్, మరణించిన లేదా గైర్హాజరు, శాశ్వతంగా వేరే చోటుకు మారిన జాబితాలో చేర్చబడుతారు. దీంతో ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. ఎన్యూమరేషన్ ఫారం ఇవ్వడానికి నిరాకరించినవారు కూడా ఓటు హక్కును కోల్పోతారు. అందుకే అప్రమత్తంగా ఉండాలి.
ఓటర్లు తమ ఓట్లను ఎక్కడ మ్యాపింగ్ చేశారో బీఎల్వోలను అడిగితే తెలుస్తో ంది. మ్యాపింగ్ చేసిన ఏరియాలో కాకుండా మరో చోట మీ ఓటు ఉ ండాలి అనుకుంటే ఖచ్చితంగా మ్యాపింగ్ చేసిన బీఎల్వో ద్వారా అన్‌మ్యాపింగ్ చేసుకోవాలి. అప్పుడు మాత్ర మే మీరు కోరుకున్న చో ట ఓటు హక్కు పొ ందేందుకు అవకాశం ఉంటు ంది. 2022 లో ఓటు ఉండటం తో పాటు, ఒక్కటి లేదా? అంతకంటే ఎక్కువ ప్రదేశాల లో ఓటు హక్కు కలిగి ఉంటే బీఎల్వోలు ఏదో ఒక్క చోట మ్యాపింగ్ చే సి ఉంటారు. దీం తో మీరు మరో చో ట ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇచ్చిన లా భం ఉండదు. సర్ మ్యాపింగ్ కీలమైన దశగా చెప్పొచ్చు.
ఆగస్టు 10వ తేదీ ఎన్యూమరేషన్ ఫామ్స్ సమర్పించిన వారి పేర్లతో డ్రాఫ్ట్ ఎలక్ట్రోరల్ రోల్ విడుదల చేస్తారు. జాబితా ప్రచురణ జరిగిన వెంటనే ఓటర్లు తమ పేరు, చిరునామా, ఇతర వివరాలు సరిగా ఉన్నాయో? లేదో? చూసుకునేందుకు అవకాశం ఉంటుంది. డ్రాఫ్ట్ ఓటరు జాబితాను ఓటర్లు ఖచ్చితంగా చూసుకోవాలి. అప్పుడు మాత్రమే తమకు ముందు ఓటు హక్కు కలిగి ఉన్నారా? లేదా అనే విషయం తెలుస్తోంది. అలాగే ఓటరు జాబితాలోని పొరపాట్లు కూడా తెలుస్తాయి.
డ్రాఫ్ట్ ఓటరు జాబితా ప్రచురణ తర్వాత, ఓటరు జాబితాలో ఓటరు పేరు లేకపోయినా, పేరులో అక్షర దోషాలు ఉన్నా, ఇంటి నెంబర్లు, చిరునామాలో మార్పులు చేయాలి అనుకున్నా.. ఓటర్లు సరి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అలాగే అర్హత లేని ఓట్ల అభ్యంతరాలు తెలిపేందుకు ఆగస్టు 10 నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. సెప్టెంబర్ 9వ తేదీ వరకు వచ్చిన అభ్యంతరాలపై ఎన్నికల నమోదు అధికారి (ఈఆర్వో) దరఖాస్తులు, అభ్యంతరాలపై విచారణ చేస్తారు. విచారణకు ముందు నోటీసులను జారీ చేస్తారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కొనసాగుతోంది. ఈ తేదీలలో అవసరమైన వారిని వ్యక్తిగత విచారణకు పిలిచేందుకు అవకాశం ఉంటుంది. ఇదే సమయంలో కొత్త పేర్లను చేర్చడంతోపాటు, తప్పులను సరి చేయడం, మరణించిన, డూప్లికేట్ లేదా శాశ్వతంగా మారిన వారి పేర్ల తొలగింపుపై నిర్ణయం తీసుకోవడం జరుగుతోంది.
అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారం తర్వాత అక్టోబర్ 12న తుది ఓటరు జాబితాను విడుదల చేస్తారు. ఇది అధికారిక ఓటరు జాబితా ఉంటుంది. తమకు ఒక్కటి కంటే ఎక్కువ చోట్ల ఓటు హక్కు ఉన్నది.
ఒక్క చోట ఓటు హక్కు కోల్పోయినా మిగిలిన చోట్ల ఓటు హక్కు ఉంటుందని నిర్లక్ష్యంతో కూడిన ధీమాతో ఉన్న వారి పేర్లు మాత్రం తుది ఓటరు జాబితాలో కనిపించకపోగా ఓటు హక్కు కోల్పోయమనే విషయం ఆలస్యంగా అర్థమవుతోంది. అయితే సులభంగా ఓటు హక్కును అధికారులు తొలగించరు. ఓటరు ఎన్యూమరేషన్ ఫాం సమర్పించకపోయినా పేరు వెంటనే తొలగించరు. ఈఆర్వో నోటీస్ ఇచ్చి వివరణ కోరిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. నోటీసులకు స్పందించకుండా ఉండే వారు మాత్రం ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నది.