రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ రైతు పోరు బాట చేపట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పలు మండలాల్లో సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
గుడిహత్నూర్‌లో..
గుడిహత్నూర్, అక్టోబర్ 25: గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదుట సీఎం రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ జీ తిరుమల్‌గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. పత్తి ధర తగ్గించవద్దని, రైతులకు ఆమోదయోగ్యమైన ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జాదవ్ రమేశ్, ముండె సంజీవ్, శగీర్, తెలంగే మాధవ్, గజానంద్ గిత్తె, బేర దేవన్న, దోమకొండ సుధాకర్, మాధవ్ కేంద్రె, ప్రశాంత్, సిందె రాము, తగరే ప్రకాశ్, వెంకట్రావ్, శ్రీనివాస్‌గౌడ్, పాటిల్ రాందాస్, రైతులు, అజీం, రావణ్ముండె, తదితరులు పాల్గొన్నారు.
సొనాల గ్రామంలో..
బోథ్, అక్టోబర్ 25 : బోథ్ మండలంలోని సొనాల బస్టాండ్‌లో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రైతు భరోసా, రైతు రుణమాఫీ కోసం పోరుబాట చేపట్టిన కేటీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ నాయకులు దహనం చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. వెంటనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని, రైతు భరోసా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సుంకిడిలో..
తలమడుగు, అక్టోబర్ 25 : మండలంలోని సుంకిడి బస్టాండ్ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు దహనం చేశారు. ఈ సందర్భంగా బోథ్ నియోజకవర్గ అధికార ప్రతినిధి మొట్టె కిరణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలపై ప్రేమ ఉంటే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఏ ఒక్క పథకం కూడా సక్రమంగా అమలు చేయకుండా ఏ ముఖం పెట్టుకొని నిరసనలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల కన్వీనర్ తోట వెంకటేశ్, కన్వీనర్ కృష్ణ, రమణ, ముచ్చ రేఖ రఘు, వెల్మ శ్రీనివాస్, అభిరాం రెడ్డి, కాటిపల్లి శ్రీనివాస్ రెడ్డి, అబ్దుల్లా, ప్రకాశ్, సుదర్శన్ రెడ్డి, పల్లవి, ఆశన్న యాదవ్, జనార్దన్, రవికాంత్ యాదవ్, మాజీ సర్పంచ్‌లు సాకే ఆనంద్, కంది నర్సింహులు, పొచ్చన్న, రాజేశ్వర్, దేవ్‌రావ్, మాజీ ఎంపీటీసీ చంటి పాల్గొన్నారు.