మామడ, ఆగస్టు 27 : కూలీ పనిచేసుకొని జీవిస్తున్న ఇద్దరిని లారీ రూపంలో వచ్చిన మృత్యువు కబలించి వే సింది. కుటుంబ పెద్ద దిక్కులను కోల్పోవడంతో గిరిజన పేద కుటుంబాల్లో వి షాదం నింపింది. వివరాలిలా ఉన్నా యి.. మామడ మండలంలోని బూరుగుపెల్లి గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆగి ఉన్న టిప్పర్‌ను లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ప్రమాదంలో నేరడిగొండ మండలంలోని చించొలి గ్రామానికి చెందిన కుమ్రం రాజేంద్రప్రసాద్(31), బందం గ్రామానికి చెందిన లాల్‌సింగ్(45), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ జిల్లాలోని బుద్ధ రామసముద్రంకు చెందిన లారీ క్లీనర్ షేక్ ఖాసీం పేర(43) మృతి చెందారు. బూరుగుపెల్లి సమీపంలోని జాతీయ రహదారిపై టిప్పర్ ద్వారా మట్టితో రోడ్డుపక్కన ఏర్పడిన గుంతలకు మరమ్మతులు చేస్తున్నారు.
ఆదిలాబాద్ వైపు నుంచి నిర్మల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న టిప్పర్‌ను ఢీకొట్టడంతో బోల్తా పడింది. టిప్పర్‌ను నడుపుతున్న లాల్‌సింగ్‌తో పాటు టిప్పర్‌లో ఉన్న రాజేంద్రప్రసాద్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. రాజేంద్రప్రసాద్ తండ్రి జంగు నేరడిగొండ మండలంలోని లకంపూర్(జి) సర్పంచ్‌గా పనిచేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ జాతీయ రహదారి నిర్వహణ కంపెనీలో కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంధం గ్రామానికి చెందిన లాల్‌సింగ్ కొన్ని రోజులుగా జాతీయ రహదారి నిర్వహణ కంపెనీలో వాహన డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు.
బంధం, చించోలిల్లో విషాదం
నేరడిగొండ, ఆగష్టు 27 : బూరుగుపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలంలోని చించోలికి చెందిన, లఖంపూర్ సర్పంచ్ కుమ్రం జంగు కుమారుడు కుమ్రం ప్రసాద్, అలాగే మండలంలోని బంధం గ్రామానికి చెందిన పాల్యా లాల్‌సింగ్ టిప్పర్ డ్రైవర్ చనిపోవడంతో రెండు కుటుంబాల సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రసాద్‌కు భార్య సూర్యమణి, కూతురు, కొడుకు ఉండగా, అలాగే లాల్‌సింగ్‌కు భార్య, ముగ్గురు కూతుర్లు, కొడుకు ఉన్నారు. దీంతో బంధం, చించోలిల్లో విషాదఛాయలు నెలకొన్నాయి.