కాసిపేట : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం దేవాపూర్ దళత వాడలో రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే ఎమ్మెల్యే స్పందించి రోడ్డు వేయాలని దళితులు డిమాండ్ చేశారు. మాదిగ హక్కుల దండోరా సంఘం ఆధ్వర్యంలో బురద రోడ్డుపై శుక్రవారం బైఠాయించి నిరసన ( Dalits protest ) తెలిపారు. గ్రామంలోని 8వ దళిత వార్డులో రోడ్డు లేక వర్షాలు పడితే మొత్తం బురదమయమవుతుందని, నడవడానికి కూడా తీవ్ర ఇబ్బందిగా ఉంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాదిగ హక్కుల దండోరా మండల అధ్యక్షుడు అటుకపురం రమేష్, తాండ్ర పెద్ద నర్సయ్య, కలువల మల్లేష్, రేణిగుంట మురళి, చొప్పదండి వెంకటేష్, సాయి, వంశీ, సుదర్శన్, మహిళలు రాజేశ్వరి, నాగమ్మ, కనుక భూ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.