దండేపల్లి, ఏప్రిల్ 1: దండేపల్లి మండలంలో అకాల వర్షానికి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు డిమాండ్ చేశారు. దండేపల్లి మండలంలోని నెల్కివెంకటాపూర్, కొండాపూర్, ధర్మరావుపేట, నాగసముద్రం గ్రామాల్లో నేలకొరిగిన మొక్కజొన్న, వరి చేలను బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడి పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎకరాకు రూ.50వేల నష్టపరిహారం అందించి ఆదుకోవాలన్నారు. సంబంధిత అధికారులు వెంటనే పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించి, ప్రభుత్వానికి నివేదిక అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ అక్కల రవి, మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, బీఆర్ఎస్ నాయకులు రేని శ్రీనివాస్, బొమ్మెన మహేశ్, గొట్ల భూమన్న, పత్తిపాక శ్రీనివాస్, నజీర్, ఉస్మాన్‌ఖాన్, రవి, ఇప్ప సాయి, జైనేని రాజేందర్, తదితరులు ఉన్నారు.
తహసీల్దార్‌కు బీఆర్ఎస్ నాయకుల వినతి
అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి, రైతులను ఆదుకోవాలని కోరుతూ తహసీల్దార్ రోహిత్ దేశ్‌పాండేకు బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ అక్కల రవి, మాజీ వైస్ ఎంపీపీ పసర్తి అనిల్, బీఆర్ఎస్ నాయకులు బొమ్మెన మహేశ్, గొట్ల భూమన్న, పత్తిపాక శ్రీనివాస్, హరీశ్, తదితరులు ఉన్నారు.