వైరా టౌన్, జూలై 24 : కొనిజర్ల మండలం గొబ్బగుర్తి గ్రామంలో తెలంగాణ తొలి దశ ఉద్యమకారుడు బచ్చు వెంకటరమణ ఇటీవల మరణించారు. ఆయన కుటుంబాన్ని శుక్రవారం మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉదృతంగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి బచ్చు రమణ అని కొనియాడారు. అనంతరం గ్రామంలో నిర్వహిస్తున్న సర్ అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. ఆమె వెంట పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

బచ్చు వెంకటరమణ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ