High Court | హైడ్రా పనితీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ చేపట్టింది. ఒకే పిటిషన్లో మూడుసార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేయకుండా మళ్లీ అదే భూమిలోకి వెళ్లడం తీవ్ర నేరమని హెచ్చరించింది. సదరు భూమిలో ఆర్మీ రక్షణ ఏర్పాటు చేయాలన్న ఉత్తర్వులను హైకోర్టు వెనక్కి తీసుకుంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షమాపణలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.
హైడ్రాకు హైకోర్టులో రోజూ మొట్టికాయలు
మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూములపై హైకోర్టులో మరోసారి విచారణ
మరోసారి రంగనాథ్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు
ఒకే పిటిషన్లో మూడుసార్లు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం చరిత్రలో ఇదే మొదటిసారి అంటూ ఆగ్రహం
కోర్టు ఉత్తర్వులపై అప్పీల్ చేయకుండా… https://t.co/zlPKKk3kCQ pic.twitter.com/rlcjTzEwkm
— Telugu Scribe (@TeluguScribe) July 24, 2026