ఆదిలాబాద్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్( Gas Cylinder) ధరను రూ. 50 పెంచడాన్ని నిరసిస్తూ సీపీఎం ( CPM ) స్థానిక కే ఆర్కె కాలనీలో గ్యాసు బండలతో నిరసన వ్యక్తం చేశారు . ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ( BJP ) ప్రభుత్వం ధరలు పెంచుతూ పేదలు, మధ్యతరగతి ప్రజల నడ్డివిరుస్తుందని పేర్కొన్నారు .
కార్పొరేట్ బడావ్యాపారుల కోసం తాపత్రయ పడే బీజేపీ ప్రభుత్వానికి పేదల గురించి పట్టడం లేదని అన్నారు . గ్యాస్ సబ్సిడీ సైతం తొలగించిందని ఆరోపించారు. . కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను వెంటనే ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటీ సభ్యురాలు ఆర్ మంజుల ,నాయకులు కె ఆశన్న , నగేష్ , అరఫా బేగం, కాలనీవాసులు మహేశ్వరీ , రేఖ ,రుక్సానా, అనసూయ, తదితరులు పాల్గొన్నారు .