e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home ఆదిలాబాద్ ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం

ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్‌ స్థాయి వైద్యం

ఇంద్రవెల్లి : ప్రభుత్వ దవాఖానలో కార్పొరేట్‌ తరహలో ప్రజలకు మైరుగైన వైద్యం అందుతుందని జడ్పీ చైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ అన్నారు. మండలంలోని ఇంద్రవెల్లి ప్రభుత్వ దవాఖానను శుక్రవారం జిల్లా వైద్యాధికారి రాథోడ్‌ నరేందర్‌తో కలిసి తనిఖీ చేశారు. రోగుల వార్డుతోపాటు ప్రసూతి రూం, రక్త పరీక్షల గదితోపాటు ప్రభుత్వ దవాఖానను పరిశీలించారు. అనంతరం బాలింతలకు కేసీఆర్‌ కిట్‌ను పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యంపై రోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దవాఖానలో అన్ని సౌకర్యాలతోపాటు వసతులు ప్రభుత్వం కల్పిస్తుందని, గ్రామాల ప్రజలు ప్రభుత్వ వైద్యాన్ని సద్వినియోగం చేసుకోని ఆరోగ్యంగా ఉండాలన్నారు.

వ్యాక్సినేషన్‌పై ప్రజలకు అవగహన కల్పించి వందశాతం పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎంవో శ్రీధర్‌, వైద్యుడు శ్రీకాంత్‌, మాజీ ఎంపీపీ కనక తుకారాం, జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు మహ్మద్‌ అబ్దుల్‌ అమ్జద్‌, ఎంపీటీసీలు కోవ రాజేశ్వర్‌, ఆశబాయి, టీఆర్‌ఎస్ నాయకులు కనక హనుమంత్‌రావ్‌, మర్సుకోలా తిరుపతి, సీహెచ్‌వో రాథోడ్‌ బాబులాల్‌, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement