చింతలమానేపల్లి, ఏప్రిల్ 9 : కాంగ్రెస్ సర్కారులో రైతులపై వేధింపులు ఎక్కువయ్యాయని, కేసీఆర్ సర్కారు పోడు భూములకు పట్టాలిస్తే.. వాటిలో సాగు చేయకుండా అడ్డుకోవడం దారుణమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం కర్జెల్లి, గంగాపూర్, బూరెపల్లి గ్రామాల్లో పర్యటించారు. రైతులు, బీఆర్ఎస్ నాయకులు, గ్రామస్తులతో సమావేశమయ్యారు. కర్జెల్లి, గంగాపూర్, దిందా, కేతిని, గూడెం, కోర్సిని తదితర గ్రామాల్లో పట్టా భూముల్లో వ్యవసాయ పనులకు వెళ్తే నోటీసులు ఇస్తామంటూ ఫారెస్టు అధికారులు బెదిరిస్తున్నారని రైతులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. రైతులు భయాందోళనలు చెందవద్దని, బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఆర్ఎస్పీ భరోసా ఇచ్చారు. కర్జెల్లిలో కాంగ్రెస్, బీజేపీ నుంచి 50 మంది బీఆర్ఎస్లో చేరారు. మండల కన్వీనర్ గోమాసే లహాంచు, నాయకులు రాజు, రామటెంకి నవీన్, వరలక్ష్మి పాల్గొన్నారు.
మళ్లీ బీఆర్ఎస్దే అధికారం..
కాగజ్‌నగర్/కౌటాల, ఏప్రిల్ 9: మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. బుధవారం సిర్పూర్ (టీ) మండలంలోని డోర్పల్లి కి చెందిన కాంగ్రెస్ నాయకుడు దుర్గం మధుకర్, కౌటాల మండలం పార్డీ గ్రామానికి చెందిన పది మంది కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరగా, ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయాచోట్ల సిర్పూర్ మండల కన్వీనర్ అస్లాం బిన్ అబ్దుల్లా, నాయకులు పనసా లక్ష్మణ్, ఎల్ములే నందాజి, దుర్గం భరత్, దుర్గం వికాస్, షఫీ, నియోజకవర్గ యూత్ కన్వీనర్ కాశీపాక రాజు, రాం టెంకి నవీన్, కౌటాల మండల యూత్ అధ్యక్షుడు తాళ్లపల్లి కార్తీక్, ఉపాధ్యక్షుడు చునార్కర్ దిలీప్ పాల్గొన్నారు.
కాగజ్‌నగర్ మినీ ఇండియా..
సిర్పూర్ కాగజ్‌నగర్ నియోజకవర్గం మినీ ఇండియా అని, ఇక్కడ అన్ని మతాలు కలిసి మెలసి జీవనం సాగిస్తారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. బుధ వారం పట్టణంలోని సంతోష్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈద్ మిలాప్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎన్నికల్లో ఓడిన అనంతరం నియోజవర్గంలో ఆర్ఎస్పీ ఉండడని ఎన్నో విమర్శలు చేశారని, నా జీవితం ముగిసే వరకూ ఇక్కడే ఉంటానన్నారు. ముఖ్య అతిథి ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, ప్రము ఖ న్యాయవాది కిషోర్ కుమార్, నాయకులు సీపీ రాజ్‌కుమా ర్, రాజ్‌కుమార్, అంబాల ఓదెలు, మోయిన్, మిన్హజ్ తదితరులు పాల్గొన్నారు.