ఎదులాపురం, ఆగస్టు 10 : కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగు రామన్న మండిపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇంకెన్ని రోజులు బీసీలను మోసం చేస్తారని ప్రశ్నించారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం కేంద్రం ఆధీనంలో ఉందంటూ చేతులు దులుపుకోవడం సరికాదని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు బిల్లు కు చట్టబద్ధత తెస్తామని ఇచ్చిన హామీని గుర్తు చేశారు. యేటా బీసీలకు 20 వేల కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, దీనికి కేంద్ర ప్ర భుత్వానికి ఎటువంటి సంబంధం లేకపోయి నా ఎందుకు అమలు చేయడం లేదన్నారు.
మహాత్మా జ్యోతిబా పూలే పేరిట చట్టబద్ధత కలిగిన బీసీ సబ్ ప్లాన్, పది లక్షల వరకు ఎటువంటి పూచీకత్తు లేకుండా రుణాలు, విద్యార్థులకు వందకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్, చేతి వృత్తులతో జీవనోపాధి పొందుతున్న వారికి పథకాల వంటి హామీలను ప్ర భుత్వం అమలు చేయకుండా బీసీలపై చిత్తశు ద్ధి లేకుండా వ్యవహరిస్తుందన్నారు. నాయకు లు మర్శెట్టి గోవర్ధన్, రౌత్ మనోహర్, ప్రహ్లా ద్, సేవ్వా జగదీశ్, రాజన్న, అశోక్ స్వామి, లక్ష్మణ్, విఠల్, అశోక్, నిఖిల్, తదితరులు పాల్గొన్నారు.