ఎదులాపురం, జూన్ 19 : రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మోసం చేస్తున్నదని మాజీ మంత్రి జోగు రామన్న ఆరోపించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగ సమస్యలపై బీఆర్ఎస్ రాష్ట్ర వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు శనివారం జిల్లా పర్యటన కు రానున్నారని తెలిపారు. ఆదిలాబాద్‌లోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడుతూ.. ప్రతి పంటనూ కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయబోమని చెప్పడం ద్వారా రైతుల ను తీవ్ర నిరాశకు గురిచేస్తున్నదన్నారు. ము ఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రైతు సమస్యల పరిషారానికి రూ.10 వేల కోట్లు సరిపోతాయని చెప్పిన ఆయన, ఇప్పుడు అధికారంలో ఉండి రైతులను ఆదుకోలేకపోతున్నారని విమర్శించారు. ఓ వైపు పంటలు పం డించాలని చెబుతూ, మరోవైపు పంట కొనుగోళ్లకు నిరాకరించడం రైతుల ఆత్మవిశ్వాసా న్ని దెబ్బతీస్తున్నదన్నారు. యూరియా కొనుగోళ్లలో అమలవుతున్న యాప్ విధానాన్ని ర ద్దు చేయాలని బీఆర్ఎస్ తరఫున పలుమార్లు ఆందోళనలు నిర్వహించామని గుర్తు చేశారు.
రైతులకు యూరియా కొరత లేకుండా ఏఈ వో క్లస్టర్ల వారీగా రైతు వేదికల్లో ప్రత్యేక కౌం టర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలను పెంచుతుండగా రాష్ట్ర ప్రభుత్వం పంట కొనుగోళ్ల విషయంలో చేతులెత్తేసిందని విమర్శించారు. రైతుల సమస్యలపై స్థానిక ప్రజాప్రతినిధులు స్పందించకుండా, ఇతర అంశాలపైనే దృష్టి సారిస్తున్నారన్నారు. ప్రతి పంట కొనుగోలుకు చట్టబద్ధత కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ ఎమ్మెల్యే మరిచిపోయారని, ప్రతి పంటకూ బోనస్ ఇస్తామని చె ప్పి చివరకు సన్న ధాన్యానికే పరిమితం కావ డం ప్రభుత్వం మాట తప్పినట్లేనని పేరొన్నా రు. వర్షాకాల రైతుబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని, ఇటీవల వర్షాల కారణం గా నష్టపోయిన రైతులకు తక్షణ సాయం అం దించాలని డిమాండ్ చేశారు. జొన్న పంట విక్రయించిన రైతులకు ఇప్పటికీ చెల్లింపులు జరగకపోవడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తున్నదని రైతాంగ సమస్యల పరిషారానికి ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మారెట్ కమిటీ మాజీ చైర్మన్ యాసం నర్సింగ్ రావు, గండ్రత్ రమేశ్, సేవ్వా జగదీశ్, పరమేశ్వర్, కుమ్ర రాజు, బట్టు సతీశ్, సూర్యకాంత్, అనిల్ అశోక్, దయానంద్ పాల్గొన్నారు.