ఆదిలాబాద్, అక్టోబర్ 4 (నమస్తే తెలంగాణ) : పేదల సంక్షేమమే లక్ష్యంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లుగా అమలు చేసిన పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం మంగళం పాడింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని వర్గాల ప్రజలు తమ పండుగలను సంతోషంగా నిర్వహించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సహాయ, సహకారాలు అందించింది. తెలంగాణలో ఆడబిడ్డలు ఎంతో ఘనంగా నిర్వహించే బతుకమ్మ పండుగకు చీరలను పంపిణీ చేసింది. గతేడాది పండుగ వరకు చీరల పంపిణీ కొనసాగగా ఆదిలాబాద్ జిల్లాలో 2,63,247 మంది లబ్ధిదారులకు అందించింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు అందించిన సాయంతో మహిళలు బతుకమ్మ పండుగను సంతోషంగా నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మాదిరిగా కాంగ్రెస్ ప్రభుత్వం సైతం పండుగకు చీరలను పంపిణీ చేస్తుందని మహిళలు ఆశించారు. చీరల పంపిణీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో మహిళలకు నిరాశ మిగిలింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా బతుకమ్మ పండుగకు ముందుగానే ఆడబిడ్డలకు చీరలను పంపిణీ చేసింది. జిల్లాలో అర్హులైన మహిళలను గుర్తించి మున్సిపాలిటీలు, గ్రామాల్లో పంపిణీ చేశారు. మహిళలకు 6 మీటర్ల, 9 మీటర్ల చీరలు కేసీఆర్ స ర్కారు ఉచితంగా అందించింది. గతేడా ది ఆదిలాబాద్ అర్బన్ మండలంలో 50,365 చీరలు, ఆదిలాబాద్ రూరల్ మండలంలో 16223, మావల మండలంలో 4000 మందికి, తలమడుగులో 13039, తాంసిలో 6530, భీంపూర్‌లో 9272, జైనథ్‌లో 18886, బేలలో 152 49, ఇచ్చోడలో 16185, గుడిహత్నూర్‌లో 11833, సిరికొండలో 6148, బ జార్హత్నూర్లో 10379, బోథ్‌లో 17, 642, నేరడిగొండలో 10,868, ఇంద్రవెల్లిలో 15,242, ఉట్నూర్‌లో 22,416, నార్నూర్‌లో 11155 మందికి, గాదిగూడలో 7815 మంది ఆడబిడ్డలకు బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం చీరల పంపిణీ నిలిపివేయడంపై మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ సర్కారు హయాంలో సీఎంగా కేసీఆర్ సారు ప్రతి ఏడాదీ ఈ సమయానికల్లా బతుకమ్మ చీరెల ను పంపేవారు. రాష్ట్రంలోని ఆడబిడ్డ లకు పుట్టింటి చీరగా భావించి అపు రూపంగా చూసేవారు. కాంగ్రెస్ స ర్కారు వచ్చినంక ఎక్కడా బతుకమ్మల కళ కనిపించడం లే దు. బతుకమ్మ చీరల జాడ లేదు. కేసీఆర్ సర్కారు ఉన్నప్పు డు బతుకమ్మలకు ఎంతటి వైభవం ఉండేది. రేవంత్‌రెడ్డి సర్కారు బతుకమ్మ చీరల పంపిణీ పద్ధతి పాటించాలి.
-కరుణ, బీఆర్ఎస్ పట్టణ కార్యదర్శి, దస్నాపూర్, ఆదిలాబాద్
ఆడబిడ్డల పండుగను గౌరవిస్తూ ప్ర తి ఏటా బతుకమ్మ చీరలను కేసీఆర్ సార్ పంపేవారు. వాటిని గ్రామాలు పట్టణాల్లో లక్షలాది మంది మహిళ లు అపురూపంగా తీసుకునేవారు. ఇపుడా ఊసే లేదు. కాంగ్రెస్ సర్కా రు పెద్దలు బతుకమ్మలను మరిచి పోయినట్లున్నారు. ఈ సర్కారు చీరె లిచ్చే పరిస్థితిలో లేదని అంతా అంటున్నారు. ఏ గ్రామంలో చూసినా బతుకమ్మ చీరెల చర్చ వినిపిస్తున్నది. కాంగ్రెస్ సర్కారు ఇప్పటికైనా ఆడబిడ్డలందరికీ బతుకమ్మ చీరెలను అందజేయాలి.
– స్వరూపారాణి , బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షురాలు, ఆదిలాబాద్