ఎదులాపురం, మార్చి 30 : బీజేపీ, కాంగ్రెస్ నాయకులు హోర్డింగ్లకే పరిమితం కాకుండా ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న హితువు పిలికారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన రణదీవ్యనగర్, ఇంద్రానగర్, ఖుర్షిద్నగర్, హమాలీవాడలకు చెందిన దాదాపు 200 మంది బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మాజీ మంత్రి జోగు రామన్న వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనం తరం జోగు రామన్న మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమానికి పనిచేయాల్సిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు ప్రజలపై బెది రింపులకు పాల్పడడం తగదన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు అజయ్, విజ్జగిరి నారాయణ, దాసరి రమేశ్, కోవా రవి, దమ్మపాల్, కొండ గణేశ్, అడప తిరుపతి, అన్నెలా వసంత్, ఉగ్గే విఠల్, మహేశ్, నీలేశ్, రాజు, సాయికుమార్, విక్రమ్ పాల్గొన్నారు.