ఆసిఫాబాద్ టౌన్, జూన్ 19 : జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను బుధవారం కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సందర్శించారు. కాసేపు విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. కబడ్డీ.. కబడ్డీ అంటూ కూతకెళ్లి పిల్లలను ఉత్సాహపరిచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వాన్ని కలిగించడంతో పాటు మానసికోల్లాసానికి దోహదపడుతాయన్నారు.
ఆటలు ఆడటం వల్ల విద్యార్థుల్లో స్నేహభావం, ఐకమత్యం పెంపొందుతుందని చెప్పారు. పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చని చెప్పారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ సమన్వయంతో ముం దుకు సాగాలని, ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.