ఇచ్చోడ, నవంబర్ 16 : బోథ్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపిస్తే నెల రోజుల్లోనే బోథ్‌ను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తామని సీఎం కేసీఆర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన గల మైదానంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభకు ఆయన హాజరై మాట్లాడారు. బోథ్‌లో ప్రభుత్వ కళాశాల, కోల్డ్స్టోర్ నిర్మిస్తామన్నారు. అలాగే కుప్టి ప్రాజెక్టు నిర్మిస్తే బోథ్ నియోజకవర్గం సస్యశామలం అవుతుందన్నారు.
రైతుబంధు దండగ అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారన్నారు. రైతులకు రైతుబంధు, 24 గంటల కరెంట్ ఉండాలంటే బోథ్ అభ్యర్థి జాదవ్ అనిల్‌ను గెలిపించుకోవాలన్నారు. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. ధరణిలో భూముంటేనే రైతుబంధు వస్తుందన్నారు. కళాకారులు మధుప్రియ ఆధ్వర్యంలో నిర్వహించిన పాటలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నృత్యాలు చేశారు. ఈ సభకు బోథ్ డివిజన్లోని తాంసి, తలమడుగు, సిరికొండ, గుడిహత్నూర్, నేరడిగొండ, సోనాల, ఇచ్చోడ మండలాల నుంచి సభకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.
ఇచ్చోడ మండలంలోని ముక్రా(కే) సర్పంచ్ మీనాక్షిని సీఎం కేసీఆర్ ప్రశంసించారు. మహిళ సర్పంచ్ ఉండి గ్రామ పంచాయతీని ప్రభుత్వ పథకాలతోనే దేశంలోనే ఆదర్శంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ నగేశ్, ఎమ్మెల్సీ దండె విఠల్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీపీ ప్రీతమ్‌రెడ్డి, సర్పంచ్ సునీత, బీఆర్ఎస్ నాయకులు వన్నెల అశోక్, గాడ్గె సుభాష్, కృష్ణకుమార్, పాండు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు పాల్గొన్నారు.
బోథ్, నవంబర్ 16 : బోథ్ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంపై జడ్పీటీసీ ఆర్ సంధ్యారాణి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చోడ ప్రజాశీర్వాద సభలో సీఎం రెవెన్యూ డివిజన్, డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తామని ప్రకటించడం హర్షణీయమన్నారు. వీటితో పాటు బోథ్‌ను మున్సిపాలిటీగా ఏర్పాటు చేయాలని, మినీ స్టేడియం, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయాలని విన్నవించామన్నారు.