నార్నూర్, జనవరి 7 : ప్రభుత్వ కార్యక్రమాలు ప్రొటోకాల్ ప్ర కారమే చేపట్టాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణ లక్ష్మి, షాదీ మూబారక్ చె క్కుల పంపిణీని మంగళవారం నిర్వహించారు. ఎమ్మెల్యే ము ఖ్య అతిథిగా పాల్గొన్నారు. నార్నూర్, గాదిగూడ మండలాలకు చెందిన 96 మంది లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హ యంలోనే పేటింటి ఆడపడుచులకు పెళ్లిళ్ల కోసం కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాన్ని అమలు చేశారని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్రెడ్డి అమలు చేయాలన్నారు. కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో కాంగ్రెస్ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
సమావేశంలో కాంగ్రెస్ కార్యకర్తలు గొడవ చేస్తుంటే పోలీసులు ఎందుకు ప ట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ మా త్రమే పాటించాలని, ప్రజాప్రతినిధులకు రక్షణగా ఉండాలని.. అధికారులు, పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పునఃరావృత్తం కాకుండా చూడాలన్నారు. నార్నూర్ సహకార సంఘం చైర్మన్ ఆడే సురేశ్, తహసీల్దార్లు జాడి రాజాలింగం, విజయానందం, ఎంపీడీవో జవహర్లాల్, ఇంద్రవెల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ శ్రీరామ్నాయక్, వైస్ మాజీ చైర్మన్ నాగోరావ్, కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్, మాజీ ఎంపీపీ కనక మోతుబాయి, సర్పంచ్ల సంఘం మాజీ మండలాధ్యక్షుడు ఉర్వేత రూప్దేవ్, మహిళ సంఘం అధ్యక్షురాలు రాథోడ్ దేవ్కాబాయి పాల్గొన్నారు.
నాగల్కొండలో షెడ్డు, బీటీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే కోవ లక్ష్మి మంగళవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నాగల్కొండ నుంచి మాన్కాపూర్ వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.4 కోట్లు, షెడ్డు నిర్మాణానికి రూ.50 లక్షలు మంజూరు చేశారన్నారు. పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాగా.. కాంగ్రెస్ ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీరా శ్యాంనాయక్తో కలిసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో లేకపోయినా ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తాన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, న్యాయవాది బానోత్ జగన్ పాల్గొన్నారు.