తాండూర్ : చాకలి ఐలమ్మ ( Chakali Ailamma ) సేవలు మరువలేనివని , ఆమె సాధించిన స్ఫూర్తితో ప్రతి ఒక్కరు ముందుకు సాగాలని సీపీఎం( CPM ) నాయకులు అన్నారు. మండల కేంద్రం ఐబీలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి వేడుకల్లో ఆ పార్టీ తాండూర్ మండల కార్యదర్శి దాగాం రాజారాం మాట్లాడారు.
చాకలి ఐలమ్మ భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, నిజాం నవాబుకూ, ఆయన తొత్తులైన భూస్వాములకూ వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి స్ఫూర్తి నిచ్చారని పేర్కొన్నారు. ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన ఐలమ్మ తెలంగాణ వీర వనిత అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు దుర్గం నానయ్య, వేల్పుల శంకర్, బొల్లం రాజేశం కే బాపు, డి వెంకటేష్, కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.