ఉట్నూర్ రూరల్, నవంబర్ 13 : ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో సీసీ రోడ్లు గుంతలమయంగా మారాయి. ప్రజలు, వాహనదారులు అవస్థలు పడుతున్నారు. వాహనదారులు నడుంనొప్పి వస్తుందని, వాహనాలు మరమ్మతులకు వస్తున్నాయని పేర్కొంటున్నారు. గంగన్నపేట్ గ్రామంలో గతేడాది కాలంగా డ్రెయిన్‌పై నిర్మించిన స్లాబ్‌కు బుంగ పడిందని పంచాయతీ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
అదేవిధంగా మండల కేంద్రంలోని శివాజీ చౌక్ వద్ద గల డ్రెయిన్‌పై నిర్మించిన స్లాబ్‌పై గుంత పడి రెండేళ్లు కావస్తున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దాని పక్కనే ఇనుప చువ్వలు పైకి తేలాయి. ఈ రోడ్డు మార్గం గుండా రోజు వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రమాదం జరిగితే గాని మేల్కొనరా అని ప్రజలు మండిపడుతున్నారు. ఈ విషయమై డీఎల్పీవో ప్రభాకర్‌ను సంప్రదించగా.. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఉట్నూర్‌లోని శివాజీ చౌక్ వద్ద గల డ్రెయిన్ స్లాబ్‌పై పడ్డ బుంగ పడి ఇనుపచువ్వలు బయటికి తేలాయి. యేడాది కావస్తున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి దగ్గరలో పాఠశాల ఉండడంతో విద్యార్థులు, ప్రజల రద్దీ అధికంగా ఉంటుంది. వాహనాలు కూడా అధికంగా తిరుగుతాయి. ప్రజా సమస్యలపై ఎవరికీ పట్టింపు లేదు. ప్రమాదాలు జరిగినప్పుడే హడావుడి చేస్తారు. తరువాత మర్చిపోతారు. ఇప్పటికైన ప్రజా సమస్యపై దృష్టి
– పులి శ్రీకాంత్, గ్రామస్తుడు, ఉట్నూర్